మళ్ళీ అదే ఫార్ములాను ఫాలో అవుతున్న పవన్ కళ్యాణ్ .. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే?

- Advertisement -

పవర్ స్టార్ Pawan Kalyan ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నారు.. ఒకవైపు రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నారు..ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత పవన్ ఉస్తాద్ భగత్ సింగ్‌తో పాటు వినోదయ సీతం అనే మరో తమిళ సినిమా రీమేక్‌ను చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వినోదయ సీతమ్ షూట్ అతి త్వరలో షురూ కానుంది. అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమా ఫిబ్రవరి 14న లాంఛనంగా ప్రారంభంకానుందని తెలుస్తోంది..

Pawan Kalyan
Pawan Kalyan

తెలుగు రిమేక్ సినిమాకు కూడా సముద్రఖని దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో పవన్ మేనల్లుడు, స్టార్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట. ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించనున్నారని టాక్.. వినోదయ సీతమ్‌ కథ విషయానికి వస్తే.. ఈ సినిమా పవన్ మరో సినిమా గోపాల గోపాల చిత్రానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ సినిమాలో పవన్ మరోసారి దేవుడిగా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకు ఆయన కేవలం 15 నుండి 20 రోజుల మాత్రమే డేట్స్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే తక్కువ రోజులు అయినా కూడా 50 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట..

Pawan Kalyan OG Movie

ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ఓ రెండు రోజుల పాటు షూట్ కూడా చేసిన సంగతి తెలిసిందే.. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడు. ఈ సినిమా తమిళ తెరీ సినిమాకు రీమేక్ అని అంటున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాలలో ఒకటి సుజీత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా OG సినిమా కూడా ఇటీవల గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.

- Advertisement -

ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ ఇటీవల అన్ని రీమేక్‌లనే చేస్తున్నాడని.. భీమ్లా నాయక్, అంతకు ముందు వచ్చిన వకీల్ సాబ్ ఇలా అన్ని వరుసగా రీమేక్‌లను చేయడం తమకు ఇష్టం లేదని అంటున్నారు ఆయన ఫ్యాన్స్.. అదే ఫార్ములా ను ఫాలో అవుతున్నారు.. మేము కొత్తగా ఏదైనా చూడాలనుకుంటున్నాము అంటూ చెప్తున్నట్లు తెలుస్తుంది.. మరి పవన్ దీనిపై ఎలా స్పందిస్తాడో లేదో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here