Ram Charan : రామ్ చరణ్ కారుని వెంబడించిన అభిమానులు..తృటిలో తప్పిన పెను ప్రమాదం!

- Advertisement -

సినీ సెలెబ్రిటీలు స్వేచ్ఛ గా బయట తిరిగేందుకు ఉండదు. ఎందుకంటే ఎక్కడ చూసిన అభిమానుల తాకిడి ఉంటుంది. దీంతో సెలెబ్రిటీలు ముఖం దాచుకొని తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇకపోతే రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మళ్ళీ ‘గేమ్ చేంజర్’ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.

నిన్న హైదరాబాద్ లో షూటింగ్ ముగించుకొని, తిరిగి వెళ్తున్న సమయం లో కొంతమంది అభిమానులు రామ్ చరణ్ బయటకి రాగానే, అతని కారుని వెంబడిస్తూ బైక్ మీద వేగం తో ప్రయాణించారు. మితిమీరిన వేగంతో వస్తుండడం ని గమనించిన రామ్ చరణ్, తన కారు వేగాన్ని పూర్తిగా తగ్గించాడు. ఆ తర్వాత వెంటనే గ్లాస్ డోర్ క్రిందకి దించి, అంత వేగంగా బండి తోలకండి. హెల్మెట్ ధరించండి, మీకోసమే నేను ఇప్పుడు స్లో గా వెళ్తున్న, దయచేసి వేగంగా ప్రయాణించొద్దు అని చెప్పాడు.

ఒక చోట కుదుపు ఉండడం తో బైక్ స్కిడ్ కూడా అయ్యింది అట, అదృష్టం బాగుంది కాబట్టి ఎవరికీ ఏమి కాలేదని తెలుస్తుంది. ఇక ‘గేమ్ చేంజర్’ చిత్రం విషయానికి వస్తే #RRR సినిమా షూటింగ్ పూర్తి అయిన పక్క రోజే రామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. అప్పట్లో వేగంగానే షూటింగ్ జరిగింది కానీ, మధ్యలో శంకర్ ‘ఇండియన్ 2 ‘ సినిమాకి కూడా దర్శకత్వం వహించాల్సిన పరిస్థితి రావడం తో ‘గేమ్ చేంజర్’ షూటింగ్ ఆలస్యం అయ్యింది.

- Advertisement -

70 శాతం కి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 2వ తారీఖున విడుదలకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుండగా, అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్ జె సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చెయ్యబోతుందట మూవీ టీం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here