Shriya Saran :ఆ స్టార్ హీరో వేధింపులు కారణంగానే శ్రీయా శరన్ టాలీవుడ్ ని వదిలేసిందా..?



Shriya Saran : ఇష్టం అనే సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన శ్రీయా శరన్, ఆ చిత్రం పెద్దగా ఆడకపోయినా కూడా అవకాశాలను దక్కించుకొని, అనతి కాలం లోనే పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది శ్రీయా. ఆ తర్వాత కేవలం తెలుగు లోనే కాకుండా హిందీ, తమిళం మరియు మలయాళం భాషల్లో దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈమె హాలీవుడ్ లో కూడా నటించి తన సత్తా చాటింది.

అయితే అకస్మాత్తుగా శ్రీయా టాలీవుడ్ కి దూరం అవ్వడం, ఎక్కువగా తమిళం లోనే సినిమాలు చేస్తుండం చూసి ఏమైంది శ్రీయా కి ఈమధ్య తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు అని అందరూ అనుకున్నారు. ఆమె చివరిసారిగా మన టాలీవుడ్ లో కనిపించిన చిత్రం #RRR. ఇందులో కూడా ఆమె పోషించింది చాలా చిన్న పాత్ర మాత్రమే.

సినిమాలో ఎలాగో గుర్తుండిపోయే పాత్ర ఇవ్వలేదు, కనీసం ఈవెంట్స్ లో శ్రీయా ని మూవీ టీం పట్టించుకోలేదు. ఇది ఆమెకి కాస్త బాధ కలిగించిన విషయం. అయితే ఆమె టాలీవుడ్ కి దూరం అవ్వడానికి కారణం ఒక సీనియర్ హీరో వేధింపులే అని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. నీకు టాలీవుడ్ లో సినిమాలు చేసుకోవాలంటే, నాకు కచ్చితంగా కమిట్మెంట్ ఇవ్వాల్సిందే , లేకపోతే నీ మీద లేనిపోనివి చెప్పి నీకు టాలీవుడ్ లో ఒక్క సినిమా అవకాశం కూడా దక్కకుండా చేస్తా అని శ్రీయా ని చాలా వేదనకి గురి చేసాడట.

దీంతో ఆమె ఆ సమయం లో ఒప్పుకున్న సినిమాలను కూడా రద్దు చేసుకొని టాలీవుడ్ కి దూరం అయ్యిందట. ఆ తర్వాత కొన్నాళ్ళకు అవకాశాలు బాగానే వచ్చాయి కానీ, ఆమె కేవలం సీనియర్ హీరోల సినిమాలకు మాత్రమే సంతకాలు చేస్తూ వచ్చింది. అవి ఫ్లాప్ అవ్వడం, అదే సమయం లో కొత్త హీరోయిన్స్ దూకుడు చూపించడం తో శ్రీయా టాలీవుడ్ కి దూరం అయిపోయిందని ఒక టాక్ ఉంది.

Tags: