Hansika Motwani : చైల్డ్ ఆర్టిస్టుగా హీరోయిన్ హన్సిక చేసిన చిరంజీవి సినిమా అదేనా..? ఇన్ని రోజులు తెలియలేదుగా!

- Advertisement -

Hansika Motawani : చైల్డ్ ఆర్టిస్టులుగా కెరీర్ ని ప్రారంభించి పెద్దయ్యాక హీరోలుగా మారిఇండస్ట్రీ లోనే తిరుగులేని స్టార్ స్టేటస్ ని దక్కించుకున్న వాళ్ళు మన ఇండస్ట్రీ లో చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు హన్సిక మోత్వానీ. ఈమె ‘దేశముదురు’ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది,అప్పటికి ఆమె వయస్సు కేవలం 16 ఏళ్ళు మాత్రమే అనేది మన అందరికీ తెలిసిన విషయం.

కానీ ఆ సినిమాకి ముందు ఆమె చైల్డ్ ఆర్టిస్టుగా సుమారు 5 సినిమాల్లో నటించింది. అందులో హృతిక్ రోషన్ కెరీర్ ని మలుపు తిప్పిన ‘కోయి..మిల్ గయా’ అనే చిత్రం కూడా ఉంది. ఈ సినిమా అప్పట్లో బాలీవుడ్ రికార్డ్స్ ని తిరగరాసింది. ఈ చిత్రం లో హన్సిక చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. అలా 2004 వ సంవత్సరం వరకు బాలనటిగా కొనసాగిన ఆమె 2007 వ సంవత్సరానికి హీరోయిన్ గా మారిపోయింది.

అయితే హన్సిక మోత్వానీ తెలుగులో బాలనటిగా నటించలేదు అనే సందేహం అందరిలో కలగొచ్చు. తెలుగు లో కూడా ఆమె చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. ఆ సినిమా మరేదో కాదు మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో అప్పట్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘అంజి’ చిత్రం. ఈ సినిమాలో చిన్న పిల్లల గ్యాంగ్ తో చిరంజీవి ఉంటాడు కదా, అందులో చిన్న అమ్మాయి పాత్ర కోసం హన్సిక ని తీసుకున్నారు. చాలా రోజుల వరకు ఆమె షూటింగ్ లో పాల్గొన్నది.

- Advertisement -

కానీ బడ్జెట్ సమస్యల కారణంగా ఈ సినిమా అప్పట్లో సంవత్సరం పాటు షూటింగ్ ఆగిపోయింది. మళ్ళీ ఏడాది తర్వాత ప్రారంభం అయ్యింది. దీంతో హన్సిక మళ్ళీ షూటింగ్ కి అందుబాటులో లేకుండా పోయింది. అందుకు కారణం ఆమెకి ఆ సమయం లో తన స్కూల్ లో పరీక్షలు ఉండడం వల్లనే అట. ఆ తర్వాత హన్సిక స్థానం లో వేరే అమ్మాయిని తీసుకొని, మళ్ళీ రీ షూట్స్ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here