Family Star Trailer Review : చులకనగా మాట్లాడాలంటే భయపడాలంటూ విజయ్ వార్నింగ్

- Advertisement -

Family Star Trailer Review  : లైగర్ ఫ్లాప్​తో నష్టాల్లో ఉన్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన కెరీర్​లో సూపర్ హిట్ (గీతా గోవిందం) ఇచ్చిన దర్శకుడు పరశరామ్​తో కలిసి ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సీతారామమ్ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్. ఏప్రిల్ 5వ తేదీ ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే మూవీ టీమ్ ప్రమోషన్స్ కూడా షురూ చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఫ్యామిలీ స్టార్ ట్రైలర్​ను రిలీజ్ చేసింది చిత్ర బృందం.

family star trailer
family star trailer

ఫ్యామిలీ ఎమోష‌న్స్, కామెడీ, హీరోహీరోయిన్ల మధ్య అదిరిపోయే కెమిస్ట్రీ, టామ్ అండ్ జెర్రీ ఫైట్​ వంటి అంశాల‌తో ఈ ట్రైల‌ర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. స్వామి.. కొత్త‌గా నాకు లైఫ్‌లో బ్రేక్‌లు ఇవ్వాల్సిన ప‌నిలేదు. ఉన్న‌దాన్ని మాత్రం చెడ‌గొట్ట‌కు అనే విజ‌య్ దేవ‌ర‌కొండ డైలాగ్‌తో ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. ట్రైల‌ర్‌లో ట్రెండీ, ట్రెడిషనల్ లుక్స్​లో మృణాల్ కనిపించింది. అయితే సీతారామం, హాయ్ నాన్న సినిమాల్లో మృణాల్​కు చిన్మయి శ్రీపాద డబ్బింగ్ చెప్పారు. కానీ ఈ చిత్రంలో మృణాల్ గొంతు కొత్తగా అనిపిస్తోంది. ఈ రోజు నుంచి ఫ్రెండ్‌షిప్‌లు, తిర‌గ‌డాలు బంద్‌. ఆ పిల్ల ఇంటికి రావ‌డానికి వీలులేదు. మీరు పైకి వెళ్ల‌డానికి వీలు లేదు అంటూ విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో ఒట్టు వేయించుకోవ‌డం న‌వ్విస్తోంది.

family star

- Advertisement -

నేనైతే మీకు ఫుల్లుగా ప‌డిపోయానంటూ మృణాల్ ఠాకూర్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో చెప్పే రొమాంటిక్ డైలాగ్ భలేగా ఉంది. బుర్ర బ‌ద్ద‌లైపోతుద్ది కొడ‌కా.. భ‌య‌ప‌డాలిరా ఇంకోసారి ఎవ‌రైన చుల‌క‌న‌గా మాట్లాడాలంటే అంటూ విజ‌య్ విల‌న్స్‌కు వార్నింగ్ ఇచ్చే సీన్ ట్రైల‌ర్‌కు హైలైట్‌గా నిలిచింది. కోపం ఎగిరిపోతుంద‌ంటే న‌న్ను కొట్ట‌వే బాబు అంటూ ట్రైల‌ర్ చివ‌ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ అన‌గానే మృణాల్ అత‌డి చెంప‌ చెల్లుమనిపించడంతో ట్రైలర్ ఎండ్ అవుతుంది.

మిడిల్ క్లాస్ కుర్రాడిగా స్టైలిష్‌గా క‌నిపిస్తూనే త‌న కామెడీతో ఫ్యాన్స్‌ను న‌వ్వించాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. రిలీజైన కొద్ది నిమిషాల్లోనే సోష‌ల్ మీడియాలో ఫ్యామిలీ స్టార్‌ ట్రైల‌ర్ ట్రెండింగ్‌గా మారింది. తన ఫ్యామిలీ కోసం ఫ్యామిలీ స్టార్ విజయ్ ఏం చేశాడు అన్న‌ది హార్ట్ ట‌చింగ్ ఎమోష‌న్స్‌తో కామెడీ, ల‌వ్‌స్టోరీ క‌ల‌గ‌లిపి ఈ సినిమాలో ద‌ర్శ‌కుడు చూపించ‌బోతున్న‌ట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ఫ్యామిలీ స్టార్ మూవీకి గోపీ సుంద‌ర్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాను తెలుగుతో పాటు త‌మిళం, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here