Vijay Devarakonda : విజయ్ దేవ‌ర‌కొండ సినిమాల్లోకి రాక‌ముందు డ‌బ్బు కోసం ఇలాంటి పనులు చేశాడా..



Vijay Devarakonda : టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. హ‌ద‌రాబాద్ లో పుట్టిన పెరిగిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. 2011లో నువ్విలా మూవీ సినీ రంగ ప్ర‌వేశం చేశాడు. దాదాపు ఐదేళ్లు ఇండ‌స్ట్రీలో ఉన్నా ఎలాంటి గుర్తింపు ద‌క్క‌లేదు. 2016లో విడుద‌లైన పెళ్లి చూపులు మూవీతో విజ‌య్ అంద‌రి క‌ళ్ల‌ల్లో పడ్డాడు. అర్జున్ రెడ్డి తో ఓవ‌ర్ నైట్ స్టార్ అయ్యాడు. ఆ త‌ర్వాత వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

Vijay Devarakonda
Vijay Devarakonda

అర్జున్ రెడ్డి సినిమాతో యూత్‏లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ . ఆ తర్వాత గీతగోవిందం, డియర్ కామ్రెడ్ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఈ సినిమాల తర్వాత అభిమానులకు రౌడీగా మారిపోయాడు విజయ్. ప్రస్తుతం ఈ హీరో ఖుషి ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. శివ నిర్వాణ రూపొందించిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‏తో తన మార్క్ చూపించడంతో ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో విజయ్ చిన్ననాటి జ్ఞాపకం ఒకటి వైరల్ అవుతుంది.

విజయ్ సినిమాల్లోకి అరంగేట్రం చేయకముందే చైల్డ్ ఆర్టిస్ట్‏గా స్క్రీన్ పై మెరిశాడు. బాలనటుడిగా కెరీర్ ఆరంభించి మెప్పించాడు విజయ్. సత్యసాయి బాబా గురించి తెలుగు సీరియల్‏లో నటించాడు విజయ్. ఇందుకు సంబంధించిన ఓల్డ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తన పాఠశాల విద్యను ఆంధ్రప్రదేశ్‏లోని పుట్టపర్తిలోని సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్‏లో చదివాడు. అక్కడ చదువుతున్న సమయంలోనే సత్యసాయి బాబా జీవిత చరిత్రను తెలిపుతూ రూపొందించిన సీరియల్లో విజయ్ నటించాడు. ఈ వీడియోను గతంలో రౌడీ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు.