Surekha Vani : సొంతఇల్లు లేదు అద్దె ఇంట్లో ఉంటున్నాను.. కారు కూడా లోన్ లో ఉంది..!

- Advertisement -

Surekha Vani : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రముఖ నటి సురేఖ వాణి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఎప్పుడు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వస్తూనే ఉంటుంది ఈమె ఎప్పుడూ కూడా వార్తల్లో హైలెట్ అవుతూనే ఉంటుంది. ఒకప్పుడు డాన్సులు చేసి అందర్నీ మెప్పించేవారు యూట్యూబ్ ఛానల్స్ ని పెట్టి డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా సంపాదిస్తున్నారు. సురేఖ వాణి డాన్స్ చేస్తే సోషల్ మీడియాలో రెస్పాన్స్ అదిరిపోతుంది. చాలా రోజుల నుండి సురేఖ వాణి పై రూమర్స్ కూడా వస్తూనే ఉన్నాయి.

SUrekha Vani
SUrekha Vani

ఈ మధ్యకాలంలో సురేఖ వాణి సినిమాల్లో నటించట్లేదు సురేఖ వాణి ఎప్పుడూ కూడా ఫారిన్ ట్రిప్స్ కి వెళ్లడం వంటివి చేస్తూ ఉంటుంది రేంజ్ రోవర్ కార్లో తిరుగుతుంది ఇంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది అని సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇటీవల ఒక మీడియా ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో, ఆమె కుండబద్దలు కొట్టి సమాధానాలు చెప్పారు. ఇంటర్వ్యూ తీసుకోవడానికి మీరు నా ఇంటికి వచ్చారు నా ఇంట్లో పెద్దగా ఏముంది ఒక సోఫా, ఒక ఏసీ, ఒక ఫ్రిడ్జ్ తప్ప. ఏ లగ్జరీ లైఫ్ ని గడపట్లేదు కేవలం మీరు అలా చూస్తున్నారు నా జీవితం చాలా మంది కంటే చిన్న జీవితం. పైగా నాకు సొంత ఇల్లు కూడా లేదు అని సురేఖ చెప్పారు.

నేను ఉంటున్నది అద్దె ఇంట్లోనే దీన్ని బట్టి మీరు నా పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అని సురేఖ వాణి అన్నారు. మీరు అనుకున్నంత లగ్జరీ గా నా జీవితం లేదు నా కారు కూడా సెకండ్ హ్యాండ్ కారు. ఒకప్పుడు బాగా డబ్బు సంపాదించినప్పుడు బీఎండబ్ల్యూ కారులో తిరిగే దానిని. ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోవడంతో కారుని అమ్ముకొని రేంజ్ రోవర్ సెకండ్ హ్యాండ్ కారుని ఈఎంఐ లో తీసుకున్నాను అని సురేఖ వాణి చెప్పారు. ఖర్చులకోసం నెలవారి మెయింటెనెన్స్ కోసం ఎప్పటినుండో ఉన్న ప్రాపర్టీని ఒకటి అమ్ముకున్నానని ఆమె చెప్పారు నేను ఎన్నో ఇబ్బందుల్ని పడుతున్నాను సాధారణ జీవితం కాదు అని సురేఖ వాణి అన్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here