Edward Snowden : #RRR చిత్రం లో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కాకుండా మిగిలిన నటీనటులందరూ గొప్ప అదృష్టవంతులు అనే చెప్పాలి. చిన్న పాత్రలు చేసినప్పటికీ కూడా వాళ్ళని ప్రపంచం మొత్తం చూసింది. ఒక్క ఆస్కార్ అవార్డు ని గెలుచుకున్న తెలుగు సినిమాలో భాగం అయ్యినందుకు ప్రతీ ఒక్కరు అదృష్టవంతులే. జపాన్ వంటి దేశాల్లో ఈ చిత్రం ఇప్పటికీ విజయవంతంగా రన్ అవుతుంది అంటే, ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అనేది మీరు అర్థం చేసుకోగలరు.

ప్రస్తుతం ఈ సినిమా చైనా దేశం లో ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. చైనా దేశం లో ఇలాంటి ఇండియన్ సినిమాలు ప్రభంజనం సృష్టించాయి. అక్కడ విడుదలైతే #RRR చిత్రం మరో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమా చైనా రిలీజ్ కి కావాల్సిన అనుమతుల కోసం ఎదురు చూస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమాలో బ్రిటీష్ అధికారి గా నటించిన ‘ఎడ్వర్డ్ స్నోన్నన్ బ్లిక్’ మీ అందరికీ గుర్తు ఉండే ఉంటాడు. ఈయనకి ఇదే తొలి సౌత్ సినిమా అనుకుంటే పొరపాటే. గతం లో ఆయన రాజన్న , షిరిడీ సాయి వంటి సౌత్ సినిమాలు, మణికర్ణిక మరియు కేసరి వంటి నార్త్ ఇండియన్ సినిమాల్లో కూడా నటించాడు ఈ హాలీవుడ్ నటుడు. రీసెంట్ గా ఆయన ధనుష్ హీరో గా నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.

ఈ సందర్భంగా రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన్ని యాంకర్ పలువురి హీరోల ఫోటోలను చూపించే వీళ్ళు ఎవరో గుర్తు పట్టగలరా అని అడుగుతాడు. ఆ ఫోటోలలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా ఉంటారు. కానీ ఆయన వాళ్ళు ఎవరో నాకు తెలియదు అని చెప్పి, తమిళ హీరో విజయ్ ఫోటోని మాత్రం గుర్తు పడుతాడు. దీనిపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు.