Pushpa 2 : పుష్ప 2లో అదిరిపోయే ఐటెం సాంగ్.. మరి ఆ భామ ఎవరో తెలిస్తే షర్ట్స్ చించుకోవాల్సిందే

- Advertisement -


Pushpa 2 : ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప 2 గురించిన చర్చే నడుస్తోంది. ఆ సినిమాకు సంబంధించిన వార్తలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. మరికొద్ది నెలలోనే ఈ సినిమా చాలా గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. కాగా పుష్పతో సినిమా ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసి.. అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కూడా అందుకున్నాడు. దీంతో పుష్ప2 తో మరిన్ని రికార్డులు బ్రేక్ చేస్తాడన్న క్యూరియాసిటీ అందరికీ ఉంది.

Pushpa 2
Pushpa 2

ఇది ఇలా ఉంటే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కెరీర్ లో ఫస్ట్ టైం ఐటెం సాంగ్ లో నటించి సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చింది. ఇప్పటికీ ఊ అంటావా మావ అంటూ ఆ పాట వచ్చినప్పుడల్లా చాలామంది ఊగిపోతూ డ్యాన్సులు చేస్తున్నారు. దీనంతటికీ దానికి కారణం కచ్చితంగా సమంత అనే చెప్పాలి. ఆ తర్వాత ఈ పాటను పాడిన సింగర్ ఇంద్రావతి.. మ్యూజిక్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ అందరూ కూడా సరైన న్యాయం చేశారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి పుష్ప2 పైన పడింది.

ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ఎవరు చేయబోతున్నారన్న విషయం గురించి కొన్నాళ్లు చర్చ నడుస్తోంది. అంతే కాకుండా ఫస్ట్ పార్టులో ఐటెం సాంగ్ కు వచ్చినంత హైప్ ఈ సినిమాలోని పాటకు తీసుకొచ్చెందుకు చిత్ర బృందం సమాలోచనలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఏ హీరోయిన్ తో తెరకెక్కించాలి అన్న విషయం ఫైనలైజ్ చేసుకున్నాడట సుకుమార్. సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ భామ దిశాపటాని ఐటెం సాంగ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది . మొదటి నుంచి దిశా పటాని అంటే హాట్ గర్ల్ అన్న పేరు ఉండనే ఉంది. ఇక ఆ భామతో ఐటమ్ సాంగ్ అంటే.. అదీ మన అల్లు అర్జున్ పక్కన చేస్తే రచ్చ రచ్చే అంటున్నారు జనాలు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here