Devara : ‘దేవర’ లో ఎన్టీఆర్ తమ్ముడిగా నటించబోతున్న స్టార్ హీరో..ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్ ఇచ్చిన కొరటాల!

- Advertisement -

Devara : #RRR లాంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ తో ‘దేవర’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘అరవింద సమేత’ చిత్రం తర్వాత దాదాపుగా ఆరేళ్లకు ఎన్టీఆర్ నుండి సోలో హీరో సినిమా విడుదల అవుతుండడం తో, ఈ చిత్రం కోసం కేవలం ఆయన అభిమానులు మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు.

ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో ని ఈ నెల 8 వ తారీఖున విడుదల చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈ గ్లిమ్స్ కి సంబంధించిన పోస్టర్ ని విడుదల చేసారు, దానికి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక పోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుండగా, విలన్ గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.

ఇది ఇలా ఉండగా, ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్టు కొరటాల శివ ఇది వరకే తెలిపాడు. మొదటి భాగం ఎండింగ్ లో ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ కి మైండ్ బ్లాస్ట్ అయ్యే ట్విస్ట్ ఇవ్వబోతున్నాడట కొరటాల శివ. అదేమిటి అంటే ఈ చిత్రం ఎన్టీఆర్ కి తమ్ముడిగా ‘సూరి’ అనే పాత్ర ఉంటుందట. ఈ పాత్ర క్లైమాక్స్ కి పది నిమిషాల ముందు ఎంట్రీ ఇస్తుందట, సెకండ్ పార్ట్ మొత్తం ఉంటుందట.

- Advertisement -

ఈ పాత్ర కోసం యూత్ లో మంచి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరో ని సంప్రదించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అతనికి సంబంధించిన షూటింగ్ పార్ట్ ని కూడా ఫినిష్ చేసినట్టు తెలుస్తుంది. ఆ యంగ్ హీరో ఎవరు? అనే వివరాలు మాత్రం బయటకి రానివ్వకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు మేకర్స్. యూత్ లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరో అంటే నాని లేదా విజయ్ దేవరకొండ అయ్యుంటారేమో అని అనుకుంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here