Samantha : సమంత చేతిలో ఆ రుద్రాక్షలు ఎందుకు ఉన్నాయో తెలుసా?



తెలుగు స్టార్ హీరోయిన్ Samantha ఆరోగ్యం బాగోలేదన్న విషయం తెలిసిందే.. మాయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు.. అప్పటినుంచి ఆమె బయట కనిపించలేదు. షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకుంది. సోషల్ మీడియాలో కూడా సైలెంట్ అయిపోయింది. ఇంటిపట్టునే ఉంటూ చికిత్స తీసుకుంటున్న సమంత.. ఎట్టకేలుకు మయోసైటిస్ వ్యాధి నుంచి కాస్త కోలుకుంది. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ మీడియా ముందుకు వచ్చింది..

Samantha at shakuntalam Trailer Launch event
Samantha at shakuntalam Trailer Launch event

సామ్ నటించిన శాకుంతలం సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించాడు.. శకుంతల జీవితం గురించి పూర్తిగా ఈ సినిమాలో చూపించారు.. ఆమె చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న పరిస్థితులను అందులో కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు. టైటిల్ పాత్రను సమంత పోషించగా.. మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంత మహారాజు పోషించాడు. మోహన్ బాబు, అనన్య నాగళ్ల, గౌతమి, ప్రకాష్ రాజ్, అల్లు అర్హ తదితరులు కీలక పాత్రలను పోషించారు. మణిశర్మ స్వరాలు అందించాడు.

Samantha
Samantha

ఇది ఇలా వుండగా.. తాజాగా బయటకు వచ్చిన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే శాకుంతలం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో సమంత సైతం పాల్గొంది. సింపుల్ గా చీర కట్టుకుని, కళ్లకు స్పెట్స్ పెట్టుకుంది వచ్చింది. అలాగే ఆమె చేతిలో రుద్రాక్ష మాల కూడా ఉంది. మొన్నీ మధ్య ముంబైలోనూ సమంత రుద్రాక్షలతోనూ దర్శనమిచ్చింది. ఎక్కడికి వెళ్లినా రుద్రాక్షలను మాత్రం సమంత వదల్లేదు.. రుద్రాక్ష మాల ధారణ అనేక అనారోగ్య సమస్యల్ని దూరం చేస్తుంది. రుద్రాక్ష ధరించడం వల్ల ప్రతి పని విజయవంతమవుతుందని నమ్ముతారు… మరి సినిమా కోసం సమంత క్యారీ చేస్తుందా లేక.. ఆరోగ్యం కోసమా అనేది ఆసక్తిగా మారింది..