Actress Samantha : ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో వెక్కివెక్కి ఏడ్చిన సమంత.. వీడియో వైరల్

- Advertisement -

Actress Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శాకుంతలం ట్రైలర్ ఇవాళ రిలీజ్ అయింది. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఎంతో అద్భుతంగా ఉందని ఫ్యాన్స్ సంబురపడుతున్నారు. ఇక ఈ మూవీలో సామ్ చాలా అందంగా కనిపిస్తోంది. డబ్బింగ్ కూడా చాలా చక్కగా చెప్పింది.

Actress Samantha

‘‘మాయ ప్రేమను మరిపిస్తుందేమో.. అభిమానాన్ని, అవమానాన్ని ఏ మాయ మరిపించలేదు’’ అని సామ్ చెప్పిన డైలాగ్ ఈ మూవీకే హైలైట్. ‘శాకుంతలం’ ఈ మూవీ ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా దీన్ని రూపొందించారు. శకుంతల, దుష్యంత మహారాజుల మధ్య ఉన్న అజరామరమైన ప్రణయ గాథ నేపథ్యంలో సినిమా సాగుతుంది. ఇందులో శకుంతల పాత్రను సమంత పోషించగా.. దుష్యంత మహారాజు పాత్రలో దేవ్‌ మోహన్‌ నటించారు. దీన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు నీలిమ గుణ. దిల్‌రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. సాయిమాధవ్‌ బుర్రా మాటలు రాశారు.

మరోవైపు శాకుంతలం ట్రైలర్‌ విడుదల వేడుకలో సమంత భావోద్వేగానికి గురైంది. గుణశేఖర్‌ మాట్లాడుతుండగా సామ కన్నీళ్లు పెట్టుకుంది. నేను ఊహించిన దాని కంటే ఎక్కువ ప్రేమ దొరికిందని సమంత అన్నది. ఎంతో ఓపిక తెచ్చుకుని ఈ వేడుకకు వచ్చానని.. శాకుంతలం తర్వాత ఈ ప్రేమ మరింత పెరుగుతుందని చెప్పింది. దర్శకుడు గుణశేఖర్‌కు సినిమాయే జీవితం. అని చెప్పింది.

- Advertisement -
Cryed in interview

“ఈ ట్రైలర్ లాంఛ్ అయిన తర్వాత మీ రియాక్షన్ చూడాలని ఓపిక లేకపోయినా ఇక్కడిదాకా వచ్చాను. నరేషన్ విన్నప్పుడు అలాగే మూవీ రావాలని అందరు నటులు అనుకుంటారు. కానీ దాదాపు చాలాసార్లు ఊహకు తగ్గట్లు సినిమా రాదు. కానీ శాకుంతలం మూవీ విషయంలో మాత్రం ఊహకు అందనంత అందంగా ఈ మూవీ వచ్చింది. మేం అనుకున్న దానికంటే చాలా బాగా ఈ ట్రైలర్ వచ్చింది. ట్రైలర్, మూవీ చూసిన తర్వాత నేను గుణశేఖర్ కాళ్లపై పడ్డాను. సినిమాపై నమ్మకంతో ఈ మూవీకి బడ్జెట్ పెట్టారు దిల్ రాజు. ఈ మూవీ గురించి ఇంకా చాలా మాట్లాడాలని ఉంది. కానీ అదంతా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడతాను.” అని సమంత చెప్పింది.

శాకుంతలం సినిమాలో హీరో దేవ్ మోహన్ అయితే.. మూవీకి హీరో సమంత అని దర్శకుడు గుణశేఖర్ అన్నారు. “ఈ సినిమా గురించి అనుకున్నప్పుడు నా కూతురు నీలిమ నా దగ్గరికి వచ్చింది. ఈ మైథాలిజీ తీయాలంటే సామ్‌ మాత్రమే సరైన హీరోయిన్ అని చెప్పింది. అప్పుడు నాకు అనిపించింది. సామ్ చాలా అల్ట్రా మోడల్ కదా ఈ పాత్రకి సరిపోదేమోనని. కానీ నా కూతురు నాకు సామ్ నటించిన రంగస్థలం మూవీ చూపించింది. ఆ చిత్రం చూశాక నాకర్థమైంది ఈ పాత్రను సమంత తప్ప ఎవరూ చేయలేరని. ఆ తర్వాత స్క్రీన్ టెస్ట్ చేశాక.. ఈ మిలీనియల్ ఆడియెన్స్‌కు శకుంతల అంటే సమంత అనే గుర్తొస్తుంది అర్థమైంది. అందుకే ఈ పాత్రలో సామ్‌ని తీసుకున్నాం. అనుకోవడమైతే అనుకున్నాం కానీ.. ఈ సినిమాకు బడ్జెట్ ఎలా..? ఈ మూవీ తీయాలంటే కోట్ల బడ్జెట్ అవసరమని తెలుసు.. దానికి దిల్ రాజు ముందుకొచ్చారు. కంటెంట్ బాగా ఉంటే చాలు.. ఎన్నికోట్లైనా ఖర్చు పెట్టేయొచ్చని చెప్పారు.” అని డైరెక్టర్ గుణశేఖర్ చెప్పారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here