Telugu Actress : ఇండస్ట్రీకి రాకముందు ఆ హీరోయిన్లు ఏం చేసేవారో తెలుసా?

samantha rashmika mandanna pooja hegde


ఇండస్ట్రీలోకి రాకముందు Telugu Actress ఏదోక పని చేస్తూ తర్వాత మోడలింగ్ లోకి అడుగు పెట్టారు.అలాంటి వారు ఇండస్ట్రీలో చాలా మందే ఉంటారు..ఆ క్రమంలోనే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే మన స్టార్ హీరోయిన్లు ఇండస్ట్రీలోకి రాకముందు ఎలాంటి ఉద్యోగాలు చేశారు.. వారి మొదటి సంపాదన ఎంత.. ఎక్కడ పని చేశారు.. వంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలని.. అభిమానులు కూడా తెగ ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి వారేవ్వరో ఇప్పుడు తెలుసుకుందాం..

సమంత:

Telugu Actress Samantha
Telugu Actress Samantha

ఆల్ ఇండియన్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకుంది. అయితే చదువుకునే రోజుల్లో పాకెట్ మనీ కోసం పెళ్లిళ్లు, ఈవెంట్లలో పనిచేసేది. అప్పట్లో సమంత అలా పనిచేసే రోజుకు 500 రూపాయలు సంపాదించేది.

రష్మిక మందన్న:

rashmika mandanna

నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా అని రష్మికని ఇప్పుడు అందరూ పిలుస్తున్నారు. రష్మిక మందన్న తన కెరీర్ లో 2016లో కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమా ద్వారా ప్రారంభించింది. అయితే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి అక్కడి నుంచి సినిమా ఆఫర్లను అందుకుంది. ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ అంతట తెగ తిరిగేస్తోంది.

పూజా హెగ్డే :

Pooja Hegde

జాతీయ స్థాయిలో తన క్రేజ్ ని సంపాదించుకున్న పూజా హెగ్డే ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో నటిస్తోంది. తెలుగులో టాప్ హీరోలతో నటించిన ఈమె ఇండస్ట్రీ లోకి రాకముందు మోడలింగ్ లో ఫ్యాషన్ ఐకాన్ గా మారింది. 2010లో ఐ యామ్ షీ, మిస్ యూనివర్స్ ఇండియా పోటీలో రెండవ రన్నరప్ గా నిలిచింది.

శృతిహాసన్:

shruti haasan

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూతురుగా గుర్తింపు తెచ్చుకున్న శృతి హాసన్ ఇండస్ట్రీలోకి రాకముందు మ్యూజిక్ లో స్పెషల్ కోర్సులు చేసింది. ఆమెకంటూ స్పెషల్ బ్యాండ్ కూడా ఉంది . 1992లో ప్లే బ్యాక్ సింగర్ తన కెరియర్ ను ప్రారంభించినా.. అప్పటికి తన వయసు కేవలం ఆరు సంవత్సరాలు మాత్రమే కావడం గమనార్హం..ఇంత టాలెంట్ ఉందని ఎవరికీ తెలియదు..

తాప్సీ :

taapsee pannu

ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెర కు పరిచయమైన తాప్సీ ఇప్పుడు నేషనల్ హీరోయిన్ గా మారింది. పింక్, బధ్లా వంటి సినిమాలతో అమితాచ్ బచ్చన్ దీటుగా నటించిన తాప్సీ ఇండస్ట్రీ లోకి రాకముందే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసేది. ఈమె చదువులో కూడా మంచి బ్రిలియంట్ కావడం గమనార్హం..ఇలా ఇంకా ఎందరో ఉన్నారు..హీరోలలో కూడా మంచి నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు.