మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఏం చదివిందో తెలుసా?

- Advertisement -

మెగా వరుణ్ తేజ్, లావణ్య ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు లావణ్య బ్యాగ్గ్రౌండ్ గురించి ఓ వార్త సోషల్ మీడియాను తెగ ఊపేస్తుంది.. ఆమె కుటుంబం, చదువు గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ప్రచారంలో ఉంది.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

లావణ్య త్రిపాఠి
లావణ్య త్రిపాఠి

అందాల రాక్షసి చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో తర్వాత రెండు మూడు సినిమాల్లో నటించి వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.. ఆ తర్వాత కొంతకాలంగా సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ ట్రెండ్ అవుతుంది..మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో రిలేషన్షిప్ లో ఉందనె వార్తలు వినిపించాయి.. ఆ వార్తలు నిజం అయ్యాయి… నిన్న వీరిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగింది.

varuntej lavanya

దీంతో అందరు ఆమె బ్యాగ్రౌండ్ గురించి వెతికేస్తున్నారు.. లావణ్య త్రిపాఠి అయోధ్యలో జన్మించింది. లావణ్య త్రిపాఠి తండ్రి హైకోర్టులో న్యాయవాది. తల్లి ఉపాధ్యాయురాలిగా పనిచేసారు. స్కూల్ విద్యాబ్యాసం డెహ్రాడూన్ లో పూర్తి చేసింది. లావణ్య త్రిపాఠికి ఒక చెల్లి, తమ్ముడు ఉన్నారు… చదువు పై అంత ఆసక్తి లేదట.. దాంతో ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ చేస్తూ ఆ తర్వాత మోడలింగ్ చేసింది..

- Advertisement -

ఇక ఉత్తారాఖండ్ టైటిల్ కూడా గెలుచుకుంది. లావణ్య త్రిపాఠి క్లాసికల్ డ్యాన్సర్ కూడా. ఆమెకి భరత నాట్యంలో మంచి ప్రావీణ్యం ఉంది..ఇక సినిమాల్లో తొలి ఛాన్స్ ఆమెకి 2012లో దక్కింది. అందాల రాక్షసి చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించింది. ఆ మూవీలో లావణ్య త్రిపాఠి క్యూట్ పెర్ఫామెన్స్ తో భలే మెప్పించింది. ఆ తర్వాత లావణ్య త్రిపాఠి దూసుకెళ్తా, భలే భలే మగాడివోయ్, మిస్టర్, అంతరిక్షం, సోగ్గాడే చిన్నినాయనా లాంటి క్రేజీ చిత్రాల్లో నటించి మెప్పించింది.. మిస్టర్ చిత్రంలో వరుణ్ తేజ్ తో కలసి నటించింది. అక్కడే వీరిద్దరి ప్రేమకి బీజం పడింది.

మనసులు కలవడంతో ప్రేమలో పడ్డారు. కానీ ఎక్కడా వీరిద్దరూ బయటపడలేదు.. మొత్తానికి ఇప్పుడు మెగా కోడలు కాబోతుంది..ఇద్దరు కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here