వరుణ్‌ తేజ్, లావణ్య త్రిపాఠి లవ్‌స్టోరీ గురించి వారికి ముందే తెలుసా? అప్పుడే మెుదలు..!

- Advertisement -

మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. కొన్నాళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ జూన్ 9న నిశ్చితార్థం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని నాగబాబు ఇంట్లో మెగా ఫ్యామిలీలు, బంధువులు, అతి కొద్దిమంది సన్నిహితుల మధ్య వరుణ్‌, లావణ్య ఉంగరాలు మార్చుకున్నారు. నిశ్చితార్థానికి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వైష్ణవ తేజ్.. ఇలా మెగా, అల్లు ఫ్యామిలీ హీరోలంతా వచ్చి సందడి చేశారు.

వరుణ్‌ తేజ్
వరుణ్‌ తేజ్

వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. కాగా, వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ గతంలో వార్తలు వచ్చినా అవన్నీ కట్టుకథలంటూ కొట్టిపారేశారు. అయితే మరోసారి వార్తలు వచ్చాక ఇదంతా ఒట్టి పుకారే అనుకుంటున్న సమయంలో నిశ్చితార్థం డేట్‌ అనౌన్స్‌ చేసి షాకిచ్చారు. ఇక అనుకున్నట్టే వరుణ్‌, లావణ్య త్వరలో ఏడడుగులు వేయబోతున్నారు. అయితే వీరిద్దరి ప్రేమ విషయం మెగా ఫ్యామిలీకి ముందే తెలుసని సమాచారం. కొన్నాళ్ల క్రితం వరుణ్ బర్త్‌డే పార్టీకి లావణ్య రావడం, పలు మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కనిపించడం, నిహారిక పెళ్ళికి లావణ్య వెళ్లడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు వచ్చాయి. అయితే నిహారిక పెళ్లిలోనే వరుణ్‌ తన ప్రేమ విషయాన్ని ఇంట్లో వాళ్లకి చెప్పాడని సినీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

వీరిద్దరూ గతంలో మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో కలిసి నటించారు. మిస్టర్ సినిమా 2017లో రిలీజ్‌ అయింది. 2016లోనే షూటింగ్‌ ప్రారంభమైంది. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య ప్రేమ మెుదలైందట. ఈ విషయాన్ని లావణ్య స్వయంగా వెల్లడించింది. తమ నిశ్చితార్థం ఫొటోలు షేర్ చేసి 2016 నుంచే వీరి ప్రేమ ఉన్నట్టు హింట్‌ ఇచ్చింది. ఇక వరుణ్‌ కూడా తన ‘లవ్‌’ దొరికేసిందంటూ నిశ్చితార్థం ఫోటోను షేర్‌ చేశాడు. దీంతో సెలబ్రెటీలు, అభిమానులు పెద్ద ఎత్తున వీరికి శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here