Trisha : బ్లూ శారీలో క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న చైన్నై బ్యూటీ త్రిష.. ఫోటోలు వైరల్..

- Advertisement -

Trisha .. ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు..వరుస సినిమాలతో హిట్ టాక్ ను సొంతం చేసుకుంటున్న ఈ అమ్మడుకు ఫాలోయింగ్ కూడా ఎక్కువే..సోషల్ మీడియాలో త్రిష కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా శారీలో మెరిసిన ఫోటోలను షేర్ చేసింది.. అవికాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.. బ్లూ శారీలో క్యూట్ స్మైల్ తో మెరిసిపోతున్న ఫోటోలు లైకులు, షేర్లతో తెగ చక్కర్లు కొడుతున్నాయి..

Trisha
Trisha

ఎన్నో తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లోనూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తోంది..ప్రస్తుతం త్రిష నటించిన భారీ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ 2’ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. గతేడాది సెప్టెంబర్ 30న మొదటి భాగం విడుదలై విజయవంతమైన విషయం తెలిసిందే. ఇక వచ్చే నెలలో రెండో భాగాన్ని రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు.. తాజాగా నిర్వహించిన Ponniyin Selvan 2 ఆడియో మరియు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో త్రిష బ్యూటీఫుల్ లుక్ లో దర్శనమిచ్చారు. బ్లూ డిజైనర్ శారీలో రాయల్ గా కనిపించింది. సీనియర్ నటి సంప్రదాయ దుస్తుల్లో హుందాగా మెరిసి అందరినీ ఆకట్టుకుంది..

పొన్నియిన్ సెల్వన్ మొదటి భాగం నుంచే త్రిష ఇలా సంప్రదాయ దుస్తుల్లో మెరుస్తూ అభిమానులను మరింతగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. సీనియర్ భామ అందాల విందుకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు..పొన్నియిన్ సెల్వన్ 2’ని ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, శోభితా ధూళిపాళ ప్రధాన పాత్రలు పోషించారు. ఏఆర్ సంగీతం అందించారు. వచ్చే నెల అంటే ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాతే త్రిష తమిళ స్టార్ విజయ్ దళపతి సరసన ‘లియో’ లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. కశ్మీర్ షెడ్యూల్ తర్వాత రీసెంట్ చెన్నైలో మరో షెడ్యూల్ మొదలుపెట్టింది.. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.. ఈ సినిమా కూడా హిట్ అయితే ఇక త్రిష కుర్ర హీరోయిన్లకు టార్గెట్ గా మారితుంది.. చూద్దాం ఏమౌతుందో..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here