ఇటలీ లో ప్రభాస్ ఉంటున్న ఈ ఇంటి రెంట్ నెలకి ఎంతో తెలుసా..? ఆ డబ్బులతో ఒక సినిమా తీసేయొచ్చు!

- Advertisement -

ఏకకాలం లో నాలుగైదు ప్రాంతీయ బాషా చిత్రాల్లో నటించడమే చాలా కష్టం, అలాంటిది భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలు ఒకే సమయం లో చేస్తున్న ఏకైక ఇండియన్ సూపర్ స్టార్ గా సరికొత్త చరిత్ర సృష్టించాడు ప్రభాస్. ఈ ఏడాది ఆయన కొద్దిరోజుల క్రితమే ‘ఆదిపురుష్’ అనే చిత్రాన్ని విడుదల చేసాడు, ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.

ప్రభాస్
ప్రభాస్

రామాయణం ని చూస్తున్నట్టుగా లేదని, రామాయణం ని వెక్కిరిస్తున్నట్టు సినిమా తీశారంటూ ఈ చిత్రం పై చాలా తీవ్రమైన నెగటివ్ ప్రచారం జరిగింది. దాంతో తొలిమూడు రోజులు బంపర్ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ, నాల్గవ రోజు నుండి మాత్రం వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలన్నీ ‘సలార్’ పైనే, ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి, సెప్టెంబర్ 28 వ తారీఖున విడుదల కాబోతుంది.

Salaar

అయితే ఇన్ని రోజులు షూటింగ్ చేసి బాగా అలిసిపోయిన ప్రభాస్ , కొన్ని రోజులు రిలాక్స్ అవ్వడానికి ఆయనకీ ఎంతో ఇష్టమైన దేశం ఇటలీ కి పయనించాడు. అక్కడ ఆయన ఉండేందుకు గాను ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఈ ఇంటి అద్దె నెలకి ఎంతో చూసిన తర్వాత అభిమానుల మైండ్ ఒక్కసారిగా బ్లాక్ అయ్యింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఇంటి రెంట్ నెలకు 40 లక్షల రూపాయలట, ప్రభాస్ ఇటలీ లో మూడు నెలల పాటు ఉండబోతున్నాడు.

- Advertisement -
prabhas

అంటే మూడు నెలలకు కలిపి కోటి 20 లక్షల రూపాయిలు ఉంటుందట , ఆ డబ్బులతో ఒక చిన్న సినిమానే తీసేయొచ్చు. పెద్ద హీరోలు విలాసాలకు చేసే ఖర్చు ఈ రేంజ్ లో ఉంటుందా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఆదిపురుష్ మూవీ విడుదల సమయం లో ముంబై లో ఉన్న ప్రభాస్, ఆ తర్వాత ఆయన అటు నుండి అటే ఇటలీ కి వెళ్ళాడట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here