తెలుగు తెరకు పరిచయం కానున్న మరో హాట్ బ్యూటీ.. అప్పుడే ఎంతమంది ఫ్యాన్సో..

- Advertisement -

తెలుగు తెరకి ఈ మధ్యకాలంలో చాలా మంది కథానాయికలు పరిచయమయ్యారు. అయితే ఆ సినిమాలు వారి కెరియర్ కి ఎంతమాత్రం హెల్ప్ కాలేకపోయాయి. దాంతో ఆ హీరోయిన్స్ అంతా కూడా సెకండ్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. అయితే వాళ్లలో ఆషిక రంగనాథ్ గ్లామర్ పరంగా ఎక్కువ మార్కులు కొట్టేసింది. ఆమె తొలి సినిమాగా వచ్చిన ‘అమిగోస్’ ఫ్లాప్ అయినప్పటికీ, ఈ బ్యూటీని అంతా గుర్తుపెట్టుకున్నారు. ఇక ఇప్పుడు మరో బ్యూటీ తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఆ సుందరి పేరే ‘యుక్తి తరేజా’. మోడలింగ్ వైపు నుంచి సినిమాల దిశగా అడుగులు వేసింది.

యుక్తి తరేజా
యుక్తి తరేజా

ఈ అమ్మడు యంగ్ హీరో నాగశౌర్య సరసన నటిస్తోంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నాగశౌర్య కూడా ఒకరు. సినిమా కోసం ఎంత కష్టపడటానికైనా రెడీగా ఉంటాడు. అలాంటి ఈ హీరోకి ఈ మధ్య హిట్లు కరువయ్యాయి. వరస ప్లాపులు సతమతం చేస్తున్నాయి. ఊహలు గుసగులాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చి, తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వరసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కానీ ఈ మధ్యకాలంలో వరసగా రెండు, మూడు ప్లాప్ లు చూశాడు. అందుకే ఈసారి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు.

Yukti Thareja

ఇక ఇటీవలే ఓ ఇంటి వాడైన నాగ శౌర్య ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే ఇటీవల శౌర్య నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇటీవలే ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాగా.. ఆ సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. ఇక ప్రస్తుతం ‘రంగబలి’ అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు శౌర్య. కొత్త దర్శకుడు పవన్ బసంశెట్టి ఈ మూవీని డైరెక్ట్ చేస్తుండగా.. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here