Salaar Movie కి చుక్కలు చూపిస్తున్న దిల్ రాజు.. అతని వల్ల ఎన్ని కోట్లు నష్టం రాబోతుందో తెలుసా?

- Advertisement -

Salaar Movie : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘సలార్’ మరో 5 రోజుల్లో మన ముందుకు రాబోతుంది. బాహుబలి సిరీస్ తర్వాత కెరీర్ ఒక్క హిట్ కూడా లేని ప్రభాస్ ఈ చిత్రం తో కం బ్యాక్ ఇస్తాడని, పాన్ ఇండియా లెవెల్ లో ఉన్న రికార్డ్స్ మొత్తాన్ని బద్దలు కొట్టేస్తాండని అభిమానులు బలమైన నమ్మకంతో ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ మరియు కర్ణాటక ప్రాంతాలలో మొదలయ్యాయి.

Salaar Movie
Salaar Movie

నార్త్ అమెరికా లో 1 మిలియన్ ప్రీమియర్ మార్కుకి అతి చేరువ లో ఉన్న ఈ సినిమా, కర్ణాటకలో ఈ ఏడాది హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రం గా నిలవబోతుంది. ఇకపోతే నైజాం ప్రాంతం లో క్రేజీ సినిమాలన్నీ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనుగోలు చేస్తుంటాడు. కానీ ఈ చిత్రాన్ని మాత్రం ఆయన కొనుగోలు చెయ్యలేదు. కారణం నిర్మాతలు ఎక్కువ ప్రైజ్ చెప్పడమే.

Prabhas

దిల్ రాజు తప్పుకోవడం తో ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ 63 కోట్ల రూపాయలకు నైజాం రైట్స్ ని దక్కించుకున్నారు. అయితే ఈ చిత్రం విడుదలయ్యే ఒక్క రోజు ముందు షారుఖ్ ఖాన్ ‘డుంకీ’ చిత్రం విడుదల అవ్వబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన నైజాం ప్రాంతం హక్కులను దిల్ రాజు కొనుగోలు చేసాడు. విడుదల భారీ నుండి అతి భారీ గా ఉండబోతుంది.

- Advertisement -
Salaar DUnki

ఇప్పటికే హైదరాబాద్ మరియు నైజాం ప్రాంతం లో అత్యధిక మల్టీప్లెక్స్ మరియు సింగిల్ స్క్రీన్ షోస్ ని భారీ గా హోల్డ్ చేసాడు. 22 వ తారీఖున విడుదల అవ్వబోయే సలార్ చిత్రానికి రికార్డు స్థాయి వసూళ్లు రావాలంటే కచ్చితంగా థియేటర్స్ భారీ గా ఉండాలి. ఇప్పుడు దిల్ రాజు ఇలా షోస్ అన్నీ హోల్డ్ చెయ్యడం వల్ల సలార్ చిత్రానికి మొదటి రోజు అదనంగా రావాల్సిన 3 కోట్ల రూపాయిల షేర్ నష్టం వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here