Venu Swamy : ‘సలార్’ ఫేట్ పై వేణు గోపాల స్వామి షాకింగ్ రియాక్షన్.. వణికిపోతున్న ప్రభాస్ ఫ్యాన్స్!

- Advertisement -

Venu Swamy : మన టాలీవుడ్ లో జాతకాలను నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు..అలాగే వాటిని కేవలం మూఢనమ్మకాలు అని కొట్టి పారేసేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే కొంతమంది జ్యోతిష్యులు చెప్పే జాతకాలు నిజంగా వాళ్లకి శాస్త్రం తెలిసి చెప్తారో, తెలియక చెప్తారో తెలియదు కానీ, వాళ్ళు చెప్పిన కొన్ని సంఘటనలు తూచా తప్పకుండ నిజం అయ్యాయి. అలాంటి జ్యోతిష్యులలో ఒకరు వేణు గోపాల స్వామి.

Venu Swamy
Venu Swamy

ఇతనొక దొంగ స్వామి అని బాబు గోగినేని అనే వ్యక్తి ఒక ప్రముఖ మీడియా ఛానెల్ లో ఆధారాలతో సహా బయటపెట్టాడు. కానీ సోషల్ మీడియా లో వేణు గోపాల స్వామి చెప్పిన కొన్ని జాతకాలు నిజం అవ్వడం తో ఆయన్ని నెటిజెన్స్ తో పాటుగా కొంతమంది సినీ ప్రముఖులు కూడా నమ్మడం ప్రారంభించారు. ముఖ్యంగా హీరోయిన్లు ఆయనని నమ్మి పూజలు చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇకపోతే ప్రభాస్ జాతకం గురించి వేణు గోపాల స్వామి అనేకసార్లు చెప్తూ వచ్చాడు.

Venu Swamy Comments

బాహుబలి సిరీస్ తర్వాత ఈ హీరో కి సక్సెస్ ఉండదు అని చెప్పాడు, ఆయన చెప్పినట్టు గానే జరిగింది. అలాగే ఆదిపురుష్ సినిమా సమయం లో కూడా ఈ చిత్రం సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ, పెద్ద ఫ్లాప్ అవుతుంది, నేషనల్ లెవెల్ లో ట్రోల్ అవుతుంది అని చెప్పుకొచ్చాడు. అతను చెప్పిన విధంగానే ఆ సినిమా ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో మనమంతా చూసాము. ఇప్పుడు ఆయన రీసెంట్ గా సలార్ మూవీ గురించి కూడా ఇదే స్థాయి కామెంట్స్ చేసాడు.

- Advertisement -
Prabhas

సినిమాలో అనుకున్నంత దమ్ము ఉండదు అని, ఈ సినిమా కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. ఇది విన్న తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ లో వణుకు మొదలైంది. ఇంతకు ముందు వేణుగోపాల స్వామి కామెంట్స్ ని పట్టించుకునే వాళ్ళు కాదు కానీ, ఎప్పుడైతే ఆయన చెప్పినవి నిజం అయ్యాయో, అప్పటి నుండి భయపడడం ప్రారంభించారు. చూడాలి మరి వేణు గోపాల స్వామి చెప్పిన జోశ్యం సలార్ విషయం లో నిజం అవుతుందో లేదో అనేది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here