Divi Vadthya : లిప్ లాక్ తో రెచ్చిపోయిన బిగ్ బాస్ దివి.. వీడియో వైరల్..

- Advertisement -

Divi Vadthya : సొట్ట బుగ్గల సుందరి దివి వాధ్య మోడల్ గా సత్తా చాటింది.. లెట్స్ గో సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది.. ఆ తర్వాత సీన్ నెంబర్ 72, మహేష్ బాబు మహర్షి సినిమాలో కీలకపాత్ర పోషించింది.. ఇలా ఎన్నో చిత్రాల్లో నటించిన దివి మాత్రం ఫేమస్ కాలేకపోయింది.. బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన దివి ఊహించని స్థాయిలో పాపులర్ అయింది..

బిగ్ బాస్ షోలో తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్న దివి ఊహించని విధంగా మధ్యలోనే ఎలిమినేట్ అయింది.. దాంతో నిర్వాహకులపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ షోలో ఎలిమినేట్ అయినా దివికి మాత్రం సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి.. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ లో ఓ పాత్రలో నటించిన దివి నటిగా తనని ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేసింది. వీటితో పాటు దివి వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది.. తాజాగా ఏటీఎం వెబ్ సిరీస్ లో నటించిన దివి లిప్ లాక్ తో రెచ్చిపోయింది.. కాగా ఆ సీన్స్ ను డిలీట్ చేశారు.. దివి లిప్ లాక్ సీన్స్ డిలీట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బిగ్ బాస్ సన్నీ లీడ్ రోల్ లో నటించిన ఏటీఎం డబ్బులు దొంగలించడం అనే స్టోరీ తో తీసిన సిరీస్ మిక్స్డ్ టాక్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సిరీస్ ప్రస్తుతం జీ 5 లో అందుబాటులో ఉంది. ఈ వెబ్ సిరీస్ లో దివి కూడా ఓ పాత్రలో నటించింది. కాకపోతే పెద్దగా సీన్స్ ఉండవు. కానీ తను నటించిన అంతవరకు మాత్రం అద్భుతంగా చేసింది. తాజాగా అందుకు సంబంధించిన ఓ క్లిప్.. యూట్యూబ్ లో వైరల్ గా మారింది.

- Advertisement -

ఇక ఈ సీన్ లో భాగంగా హాస్టల్లో ఉండే దివిని చూడడానికి ఆమె బాయ్ ఫ్రెండ్ వస్తాడు.. అదే టైం కి వార్డెన్ రెంట్ కట్టలేదని ఆమెను అరుస్తూ ఉంటాడు. ఆమె బాయ్ ఫ్రెండ్ వార్డెన్ కి ఆ డబ్బులు కట్టి దివికి లిప్ కిస్ ఇస్తాడు. వీళ్లిద్దరూ లిప్ లాక్ తో రెచ్చిపోతారు. ఆ సీన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here