Samantha : ఖుషి కథలో మార్పు కోసం సమంత బెట్టు.. అందుకేనా..?టాలీవుడ్ స్టార్ హీరోయిన్ Samantha గత కొన్నాళ్లుగా మయోసైటిస్ అనే ఆటోఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని నెలలు విశ్రాంతి తీసుకున్న సామ్.. ఇప్పుడిప్పుడే సినిమా సెట్‌లోకి అడుగుపెడుతోంది. చాలా రోజుల తర్వాత సమంత ముంబయి ఎయిర్‌పోర్టులో ఇటీవల దర్శమనమిచ్చింది. అంతలోనే సామ్ సిటాడెల్ సెట్‌లోకి అడుగుపెట్టిందంటూ ఆ సిరీస్‌లో హీరోగా నటిస్తున్న వరుణ్ ధావన్ అప్డేట్ ఇచ్చాడు.

Samantha Kushi Movie
Samantha Kushi Movie

ఇక నెమ్మదిగా సమంత కోలుకుంటున్నట్టే కనిపిస్తోంది. ఇటీవలే జిమ్‌లోనూ దర్శనమిచ్చింది ఈ భామ. తనను వీక్.. సెన్సిటివ్ అన్న వాళ్లకు కసరత్తులు చేస్తూ ఫొటోలకు పోజు ఇచ్చి మరీ ఐయామ్ స్ట్రాంగ్ అని చాటి చెప్పింది. ఇక బాలీవుడ్‌లో సిటాడెల్‌తో పాటు సామ్ తెలుగులో విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న ఖుషి షూటంగ్‌లో పాల్గొనాల్సి ఉంది.

అయితే విజయ్ దేవరకొండ ఖుషి టీమ్‌కు సమంత పెద్ద షాక్ ఇచ్చిందట. ఖుషి సినిమా కథ మార్చమని చెప్పినట్టు తెలుస్తోంది. అదేంటి ముందు అనుకున్న కథకే కదా సమంత ఓకే చెప్పింది మరి ఇప్పుడు కథ ఎలా మారుస్తారు అని అనుకోవచ్చు. విజయ్ దేవరకొండ సమంత లీడ్ రోల్‌లో శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా ఫిక్స్ చేసుకున్నారు. ఆల్రెడీ ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా జరుపుకున్న ఈ సినిమా కథలో విజయ్ దేవరకొండ డామినేషన్ ఎక్కువ ఉందని.. సమంత పాత్రకు అంత ప్రిఫరెన్స్ లేదని టాక్.

గతంలో సమంత.. శివ నిర్వాణ దర్శకత్వంలో మజిలీ సినిమాలో నటించింది. ఈ సినిమాలో శ్రావణి పాత్రకు ఎంత క్రేజ్ వచ్చిందో తెలిసిందే. పెళ్లి తర్వాత నాగచైతన్య-సమంత నటించిన సినిమా.. అది కూడా భార్యాభర్తలుగా కనిపించిన చిత్రం.. ఆ మూవీలో సమంత పాత్రకు ప్రాధాన్యత ఉండటంతో ఈ చిత్రం హిట్ అయింది. అయితే అదే నమ్మకంతో శివ నిర్వాణ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట సమంత.

ఇక నెమ్మదిగా సమంత కోలుకుంటున్నట్టే కనిపిస్తోంది. ఇటీవలే జిమ్‌లోనూ దర్శనమిచ్చింది ఈ భామ. తనను వీక్.. సెన్సిటివ్ అన్న వాళ్లకు కసరత్తులు చేస్తూ ఫొటోలకు పోజు ఇచ్చి మరీ ఐయామ్ స్ట్రాంగ్ అని చాటి చెప్పింది. ఇక బాలీవుడ్‌లో సిటాడెల్‌తో పాటు సామ్ తెలుగులో విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న ఖుషి షూటంగ్‌లో పాల్గొనాల్సి ఉంది.

Samantha VIjay Deverakonda

మొదట ఖుషి కథ విని ఓకే చెప్పిన సమంత మయోసైటిస్ వ్యాధి వల్ల చాలా నెలల పాటు ఇంటిపట్టునే ఉంది. ఈ సమయంలో సినిమా కథ గురించి మరోసారి ఆలోచించినట్టుంది. ఆ మూవీలో తన పాత్రను విజయ్ పాత్ర డామినేట్ చేస్తోందని గమనించింది. తన పాత్ర చాలా వీక్‌గా ఉందని.. తన ఇమేజ్‌కు తగ్గట్లు కథలో కొన్ని మార్పులు చేయాలని టీమ్‌కు సూచించిందట.

శివ నిర్వాణ తన మొదటి సినిమా నుంచి ప్రయోగాత్మక కథలనే ఎంచుకుంటూ హిట్ కొడుతున్నాడు. శివ చేసిన సినిమాల్లో టక్ జగదీష్ ఒక్కటే అంచనాలను అందుకోలేదు కానీ నిన్ను కోరి, మజిలీ సినిమాలో అటు ప్రేక్ష కులను అలరించడమే కాదు బాక్సాఫీస్ వద్ద కూడా సత్తా చాటాయి. అందుకే శివ మీద నమ్మకం ఉంచి సమంత కమిట్ అవ్వొచ్చు. అయితే ఖుషి విషయంలో సమంత ఎందుకో తన పట్టు విడవట్లేదని అంటున్నారు. కథలో మార్పు కోసం బెట్టు చేస్తోందని తెలుస్తోంది. మరి ఆమెకు నచ్చినట్టు కథలో మార్పులు చేస్తారా లేదా అన్నది చూడాలి.

ఇప్పటికే సమంత గుణశేఖర్ డైరెక్షన్‌లో శాకుంతలం సినిమా చేసింది. ఆ మూవీ ఫిబ్రవరి 17న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో సమంత నటనకు నేషనల్ అవార్డ్ వస్తుందని చిత్రయూనిట్ చెబుతున్నారు. లాస్ట్ ఇయర్ యశోదతో మరోసారి తన సత్తా చాటిన సమంత ఈ ఏడాది శాకుంతలం, ఖుషి సినిమాలతో అలరించనుంది. అలాగే సిటాడెల్ బాలీవుడ్‌ సిరీస్‌తో పాటు ఓ హాలీవుడ్ మూవీ రీమేక్‌లోనూ కనిపించనుంది.