Keerthy Suresh : దసరా మూవీ సెట్ లో కీర్తి సురేశ్ నేస్తాలను చూశారా..?



Keerthy Suresh : దసరా సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది కీర్తి సురేశ్. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఈ బ్యూటీ చెన్నై, ముంబయి, కేరళ, హైదరాబాద్ లకు చక్కర్లు కొడుతోంది. వెరైటీ ఔట్ ఫిట్స్ లో సందడి చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తోంది. 

Keerthy Suresh
Keerthy Suresh

కీర్తి దసరా సినిమా ప్రమోషన్స్ కోసం సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచూ సినిమాకు సంబంధించిన పోస్టులు పెడుతూ అభిమానులను ఎంగేజ్ చేస్తూ ఉంది. ఫ్యాన్స్ కు దసరా మూవీపై అంచనాలు పెంచుతోంది. మరోవైపు తన వెరైటీ ఔట్ ఫిట్స్ లో ఫొటోలు చేస్తూ కుర్రాళ్లను ఫిదా చేస్తోంది. 

తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని వీడియోలు పోస్టు చేసింది. దసరా సినిమా షూటింగులో తీసిన ఈ వీడియోలు చాలా క్యూట్ గా ఉన్నాయి. ప్రస్తుతం కీర్తి పోస్టు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ వీడియోల్లో ఏముందంటే..

కీర్తి సురేశ్ దసరా సినిమాలో వెన్నెల అనే పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగులో వెన్నెల అదేనండి మన కీర్తి.. కొంతమందితో స్నేహం చేసిందట. ఆ స్నేహితులెవరో వీడియోలో చూపిస్తూ తన అభిమానులకు పరిచయం చేసింది. ఈ వీడియోలో కీర్తి ఆవు, దూడ, మేకలు, కోళ్లతో ఆడుతూ సరదాగా కనిపించింది. వీడియో చివరలో తన పెట్ డాగ్ తో ఉన్న ఫొటోను పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

మరోవైపు ఈ సినిమాలో కీర్తి డీ గ్లామర్ పాత్రలో నటిస్తోందనే విషయం ట్రైలర్ లో చూస్తే అర్థమైపోతోంది. ఈ చిత్రంలో కీర్తి నానికి జోడీగా నటిస్తోంది. సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్‌ ఇండియా సినిమా ‘దసరా’  త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. యూఏ (UA) సర్టిఫికెట్‌ జారీ చేసింది. మొత్తంగా ఈ చిత్రానికి 16 కట్స్‌ చెప్పింది. ఈ సినిమా నిడివి 2 గంటల 39 నిమిషాలు.

నాని ఊరమాస్‌ పాత్రలో నటించడం, తనకు తొలి పాన్‌ ఇండియా చిత్రంకావడంతో ‘దసరా’ పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌ అంచనాలు పెంచాయి. సింగరేణి సమీపాన ఉండే వీర్లపల్లి గ్రామం నేపథ్యంలో నూతన దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల ఈ సినిమాని తెరకెక్కించారు. మార్చి 30న రిలీజ్‌కానున్న ఈ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ అయినట్టు చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది.