హీరోయిన్ కు గుడి కట్టిస్తానన్న ఫ్యాన్.. పడిపడి నవ్వుకున్న గోపీచంద్..

- Advertisement -

డింపుల్ హయతి.. ఈ పేరు ఈ మధ్య తెగ వినిపిస్తుంది.. యువతని పిచ్చెక్కించే అందం ఉన్నప్పటికీ తొలి విజయం కోసం డింపుల్ ఎదురుచూస్తోంది. రామబాణంతో తన తొలి విజయం సొంతం అవుతుందని డింపుల్ భావిస్తోంది..యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ రామబాణం. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మే 5న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. లౌక్యం, లక్ష్యం ఫేమ్ శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకుడు. సూపర్ హిట్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో మంచి అంచనాలు ఉన్నాయి.ఈ చిత్రంలో గోపీచంద్ సరసన హాట్ బ్యూటీ నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ మేరకు సినిమాపై బజ్ ను క్రియేట్ చేసేందుకు చిత్రాయూనిట్ ప్రమోషన్స్ చేస్తున్నారు..

డింపుల్ హయతి
డింపుల్ హయతి

సిమిమా రిలీజ్ కు కేవలం కొద్ది రోజులు మాత్రమె ఉండటం తో హీరో, హీరోయిన్లు వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు. తాజాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే రామబాణం టీమ్ ఒక ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో గోపీచంద్, డింపుల్ హయతి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు డింపుల్ అయితే కౌంటర్ ఇచ్చింది.. ప్రెస్ మీట్ లో భాగంగా ఒక రిపోర్టర్ హీరోయిన్ డింపుల్ హయతిని ప్రశ్నిస్తూ.. నేను గుడిని కట్టిద్దామని అనుకుంటున్నా మీకు.. పాలరాతి ఓకేనా,లేదా సిమెంట్ తో కట్టించిన అంటే దానికి హయాతి రెండు కాదు బంగారంతో కట్టించు అంటుంది.. హీరోయిన్ కౌంటర్ కు గోపీచంద్ పడిపడి నవ్వాడు.. అందుకు సంబందించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది..

Gopichand dimple hatiya

మొన్నీమధ్య ఓ ప్రెస్ మీట్ లో ఓ రిపోర్టర్ ఈ సినిమాలో మీ క్యారెక్టర్​ కూడా కొంచెం వల్గర్​గా, రొమాంటిక్​గా ఉన్నట్లు అనిపిస్తోంది అది నిజమేనా అని డింపుల్​ హయతిని ప్రశ్నించాడు. వెంటనే స్పందించిన డింపుల్.. వల్గర్ అంటారేంటి అంటూ ఎదురు ప్రశ్నించింది. సినిమాలో ఎక్కడా అలాంటి సీన్స్ లేవు. అలాంటి గ్లింప్స్ కూడా వదల్లేదు.

- Advertisement -

సినిమా పాటల్లో, పోస్టర్లలో అన్ని చోట్ల శుభ్రంగా ఉన్నాను. వల్గర్ అంటుంటే తనకు ఏమీ అర్థం కావడం లేదని నవ్వుతూనే అసహనాన్ని వ్యక్తం చేశారు డింపుల్… ఇప్పుడు ఇలా ప్రశ్నించడం పై పాప కొంత హర్ట్ అయినా కూడా స్పాట్ లోనే కౌంటర్ ఇవ్వడంతో అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఇక ఈ సినిమా అయిన అమ్మడుకు ఫెమ్ ను అందిస్తుందేమో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here