Dimple Hayati : రిపోర్టర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన డింపుల్ హయాతి.. ఎందుకో తెలుసా?

- Advertisement -

Dimple Hayati : తెలుగు సీనియర్ హీరో గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా చేస్తున్న తాజా చిత్రం రామబాణం… శ్రీవాసు దర్శకత్వం వహిస్తున్నారు.. మే 5న రామబాణం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలతో బిజీగా మారిపోయింది. తాజాగా హీరోయిన్ డింపుల్‌ హయతి రామబాణం విశేషాలను మూవీ లవర్స్ తో పంచుకుంది… ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.. ఈ క్రమంలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు అదిరిపోయే సమాధానం చెప్పింది.. దానికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..

Dimple Hayati
Dimple Hayati

రామబాణంలో వ్లోగర్‌గా కనిపించేందుకు ఎలాంటి హోం వర్క్‌ చేశారు..?.. అని ఓ రిపోర్టర్ అడగ్గా.. దానికి హయాతి వల్గర్ ఏముంది.. ఆ సీనుకు తగ్గట్లు చేశాను.. అందులో మీరు తప్పుగా అనుకుంటే నేనేం చెయ్యాలి అంటుంది.. దాంతో అతను సైలెంట్ అవుతాడు.. నేనెలాంటి హోం వర్క్‌ చేయలేదు. డైరెక్టర్‌ శ్రీవాస్‌గారు నాకు చాలా సాయం చేశారు. ప్రత్యేకమైన పరిస్థితుల్లో నేనెలా స్పందించాలనేది చెబుతూ.. కొన్ని సన్నివేశాల్లో సులభంగా నటించేందుకు సపోర్ట్ ఇచ్చారు. రెఫరెన్స్‌ కోసం కొన్ని యూట్యూబ్‌ వ్లోగ్స్‌ వీడియోలు చూశానని చెప్పింది.. అలాగే భైరవి పాత్ర సినిమా కథతో పూర్తిగా లింకప్‌ అయి ఏం ఉండదు. కానీ హీరోతో ప్రయాణించే పాత్ర. అందుకే నా పాత్ర ప్రేక్షకులకు చాలా వినోదాన్ని పంచేలా సాగుతూ.. కథలో లీనమవుతుంది. ఇంతకన్నా మించి ఎక్కువ చెప్పలేనంది..

Dimple Hayati COmments

ఖిలాడీ చేస్తున్న టైంలో రామబాణంకు సంతకం చేశా. ఖిలాడీ విడుదల తర్వాత రామబాణంలో భైరవి పాత్రలో నన్ను తీసుకునేందుకు వెనకాడారు. పక్కింటి అమ్మాయిలా కనిపించే పాత్రలో నటించే వ్యక్తిని వెతుకుతున్న క్రమంలో మేకర్స్ నాకు కొన్ని స్క్రీన్‌ టెస్టులు చేశారు. ఏదో అలా వర్కవుట్‌ అవడంతో రామబాణం ప్రాజెక్టులో భాగమయ్యా.

- Advertisement -

గోపీచంద్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌ ఎలా ఉంది..? చాలా సంతోషంగా ఉంది. గోపీచంద్‌ చాలా తక్కువ మాట్లాడతారు.. సెట్స్‌లో కూడా ఎక్కువగా ఏం మాట్లాడరు. అలాంటి కెమిస్ట్రీలో పనిచేయడం నాకు కొంత ఛాలెంజింగ్‌గా అనిపించింది. నేను ఖిలాడీలో పనిచేసిన రవితేజ చాలా ఎనర్జిటిక్‌ పర్సన్‌. కానీ ఇక్కడ మాత్రం చాలా డిఫరెంట్‌ పర్సన్‌తో పనిచేశా. గోపీచంద్ జెంటిల్‌మెన్‌. రామబాణం షూటింగ్‌లో నాకు చాలా సహకరించారు… ఈ సినిమా అందరికి నచ్చుతుంది.. మీరే ఎలా ఉందో చెబుతారు అని అంటుంది.. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here