పెళ్లి కాకుండా తల్లి అయినందుకే ఆ హీరోయిన్ ను బ్యాన్ చేశారా..

- Advertisement -

ఒకప్పుడు కుర్రకారును తన అందంలో ఉర్రూతలూగించింది నటి ఇలియానా. అయితే ప్రస్తుతం సరైన సినిమా అకాశాలు రాక సమమతమవుతోంది. కొన్నాళ్లుగా సౌత్ సినిమాలకు దూరంగా ఉంటోంది ఇలియానా. తెలుగులో అవకాశాలు తగ్గడంతో పాటు తమిళంలో పూర్తిగా సినిమాలు చేయడం లేదు ఈ బ్యూటీ. తాజాగా ఈ అమ్మడు తల్లి అవుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై చాలా మంది ఆమెను విమర్శించారు. ఇదేం పాడు పని అని దుమ్మెత్తిపోశారు. ఇప్పుడు ఇదే ఇలియానాకు అవకాశాలు కూడా రాకుండా చేస్తుందని అంటున్నారు.

ఇలియానా
ఇలియానా

తమిళ ఇండస్ట్రీలో వాళ్లు మాములుగానే కాస్త పద్ధతులు పాటిస్తారు. ఇలియాన చెప్పిన ఈ విషయం వల్ల ఆమెకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారని టాక్ వినిపిస్తుంది. దీనితో పాటు మరొక కారణం కూడా ఉంది. ఇలియానా తెలుగులో రవితేజ నటించిన ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా సమయంలో తమిళంలో ఓ సినిమా చేయాల్సి ఉంది.

అందుకు అక్కడ ఓ పెద్ద నిర్మాత నుంచి డబ్బులు కూడా తీసుకుందట. అయితే తర్వాత సినిమా చేయలేదట. ఇదేంటని అడిగితే.. ‘‘డబ్బులు ఇవ్వను, ఇంకో సినిమా చేస్తానులే’’ అని చెప్పడంతో ఆ నిర్మాత సీరియస్ అయ్యాడట. ఆ విషయంపై కోలీవుడ్ నడిగర్ సంఘంతో పాటు సౌత్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కూడా ఫిర్యాదు చేశాడట. దీంతో ఇలియానాను పదేళ్ల పాటు సౌత్ సినిమాలలో నటించకుండా బ్యాన్ చేశారట. దీంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలియానా ఇంతపని చేసిందా అని ఆశ్చర్యపోతూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.

- Advertisement -

ఇలియానా కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉండేది. అయితే ఆమె వ్యాఖ్యల వల్లే టాలీవుడ్ లో కూడా అవకాశాలు తగ్గాయి అంటారు. ఓ సందర్భంలో ఇలియానా తనకు బాలీవుడ్ లోనే సెటిల్ అవ్వాలి అదే నా కోరిక అని చెప్పింది. ఇక అప్పటి నుంచి ఆమెపై టాలీవుడ్ అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అయితే బాలీవుడ్ లో కొన్ని హిట్ సినిమాలలో నటించినా ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. మరోవైపు సౌత్ లో కూడా అవకాశాలు తగ్గిపోయాయి. గతంలో రవితేజ నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాలో నటించిది. ఆ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేదు. దీంతో మళ్లీ ఎలాగైనా టాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తోందట ఈ బ్యూటీ.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here