Radhika Sarathkumar : రీయూనియన్‌లో రాధ డ్యాన్స్‌.. ఫిదా అయిన స్టార్స్.. వీడియో వైరల్‌



ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా 80 కాలం నటీనటుల రీ యూనియన్ ఏర్పాటు చేశారు. 80లో వెండితెరపై ఓ వెలుగు వెలుగు తెలుగు ప్రేక్షకుల మదిలో చిరకాలం తమ ముద్ర వేసిన తారలంతా ఒక చోట కొలువుదీరారు. అప్పటి స్మృతులను గుర్తు చేసుకుంటూ.. నేటి తరం గురించి ముచ్చట పెడుతూ సందడిగా గడిపారు. ముంబయిలో ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ఈ ఏడాది వేడుకను హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వేడుకకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లంతా ఈ తారల తళుకు ఏ మాత్రం తగ్గలేదని కామెంట్స్ చేస్తున్నారు. వన్స్ ఏ స్టార్ ఈజ్ ఆల్వెజ్ ఏ స్టార్ అంటూ కితాబిస్తున్నారు. ఒకప్పటి అగ్రకథానాయిక Radhika Sarathkumar డ్యాన్స్‌కు మెగాస్టార్‌ చిరంజీవి ఫిదా అయ్యారు.

 

Radhika Sarathkumar
Radhika Sarathkumar

 

 ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ప్రశంసించారు. మరోవైపు వెంకటేశ్‌ ఏకంగా పూలదండ వేశారు. ఇక తోటి నటి సుహాసిని ఆత్మీయంగా అభినందనలు తెలిపారు. ఈ అద్భుత ఘట్టానికి ముంబయిలోని జాకీ ష్రాఫ్‌ నివాసం వేదికైంది. రీయూనియన్‌లో భాగంగా 80ల్లో వెండితెర వేదికగా సందడి చేసిన దక్షిణాది, ఉత్తరాది నటీ నటులందరూ ఇటీవల కలిశారు. ఇందులో భాగంగా నటీనటులందరూ ఒకప్పటి హిట్‌ సాంగ్స్‌కు డ్యాన్స్‌లు చేసి అలరించారు.

రాధ ‘Sajna Hai Mujhe’ అనే హిందీ పాటకు కాలు కదిపారు. పాటకు అనుగుణంగా హావభావాలు పలికిస్తూ ఆమె చేసిన డ్యాన్స్‌కు అక్కడే ఉన్న నటీనటులందరూ ఫిదా అయ్యారు. ‘వావ్‌ సూపర్‌’ అంటూ చప్పట్లు కొట్టి ఆమెను ఉత్సాహపరిచారు. ఈ డ్యాన్స్‌ పూర్తయ్యే సమయానికి వెంకీ ఓ చిన్న పూలమాలను తీసుకువెళ్లి రాధ మెడలో వేయగా.. చిరంజీవి ఆలింగనం చేసుకుని మెచ్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె ట్విటర్‌ వేదికగా షేర్‌ చేస్తూ.. ‘‘80 రీయూనియన్‌కు సంబంధించిన ఓ మధుర జ్ఞాపకం. నాకెంతో ఇష్టమైన పాటకు డ్యాన్స్‌ చేసినందుకు ఆనందంగా ఉంది. ఇంతకంటే సంతోషమైన విషయం ఏమిటంటే నా మిత్రులు చిరు, వెంకటేశ్‌, జాకీ ష్రాఫ్‌, పూనమ్‌, స్వప్న, సరిత అక్కతోపాటు అందరూ నాపై చూపించిన ప్రేమ’’ అని ట్వీటారు.

ఈ ఏడాది రీయూనియన్‌కు జాకీ ష్రాఫ్‌ ఆతిథ్యమివ్వగా చిరంజీవి, వెంకటేశ్‌, నదియా, రమ్యకృష్ణ, విద్యాబాలన్‌, సుహాసిని, జయప్రద, రాధ, శోభన, భానుచందర్‌, అనుపమ్‌ ఖేర్‌, శరత్‌కుమార్‌, నరేశ్‌, అనిల్‌ కపూర్‌, అర్జున్‌ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.