Shriya Reddy : ‘సలార్’ నటి శ్రీయా రెడ్డి ఒక ప్రముఖ ఇండియన్ క్రికెటర్ కూతురు అనే విషయం మీకు తెలుసా?

- Advertisement -

Shriya Reddy : లేడీ విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా సౌత్ లో మంచి ఇమేజి ని దక్కించుకున్న వారిలో ఒకరు శ్రీయా రెడ్డి. వాస్తవానికి ఈమె ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గానే అడుగుపెట్టింది. కానీ పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది. దీంతో విశాల్ హీరో గా నటించిన ‘పొగరు’ సినిమాలో మొట్టమొదటిసారిగా లేడీ విలన్ రోల్ చేసింది. ఈ రోల్ లో ఆమె నట విశ్వరూపం చూపించింది అనే చెప్పాలి.

Shriya Reddy
Shriya Reddy

కెరీర్ ని మలుపు తిప్పిన ఈ పాత్రతో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న శ్రీయా రెడ్డి కి ఆ తర్వాత అన్నీ అలాంటి తరహా పాత్రలే వచ్చాయి. రీసెంట్ గా ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘సలార్’ చిత్రం లో లేడీ విలన్ రోల్ లో కనిపించి మంచి మార్కులు కొట్టేసింది. ఇదంతా పక్కన పెడితే శ్రీయా రెడ్డి గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాము.

Shriya Reddy Photos

శ్రీయా రెడ్డి కేవలం ఒక సినిమా ఆర్టిస్టు, ప్రముఖ హీరో విశాల్ రెడ్డి కి వదిన అవుతుంది అని మాత్రమే మీ అందరికీ తెలుసు. కానీ ఈమె ఒక ప్రముఖ ఇండియన్ క్రికెటర్ కి కూతురు అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. అసలు విషయం లోకి వెళ్తే ఒకప్పుడు భరత్ రెడ్డి అనే ఇండియన్ క్రికెటర్ ఉండేవాడు. అతను దినేష్ కార్తీక్ వంటి స్టార్ క్రికెటర్స్ కి శిక్షణ కూడా ఇచ్చాడు.

- Advertisement -
Shriya Reddy

అలా ఎంతో మంది క్రికెటర్స్ ని తయారు చేసిన భరత్ రెడ్డి కూతురు స్పోర్ట్స్ లోకి వెళ్లకుండా, సినీ రంగాన్ని ఎంచుకుంది. ఈ విషయం తెలుసుకొని ఇప్పుడు నెటిజెన్స్ భరత్ రెడ్డి హిస్టరీ ఏమిటి?, అతను ఇండియన్ క్రికెట్ టీం కి ఎలాంటి సేవలు చేసాడు వంటివి తెలుసుకునేందుకు గూగుల్ లో వెతుకుతున్నారు. ఇకపోతే శ్రీయా రెడ్డి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ చిత్రం ‘ఓజీ’ లో ఒక పవర్ ఫుల్ పాత్రని పోషిస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here