Ashu Reddy : ఛీ..ఛీ.. హరితో బోల్డ్ బ్యూటీ కాలు జారిందా..నిజమేనా?

- Advertisement -

Ashu Reddy : సోషల్ మీడియా ఎంతో మందిని స్టార్స్ ను చేసింది.. వారిలోని టాలెంట్ను బయట పెడుతుంటే.. మరి కొంతమంది మాత్రం ఉన్న పేరును పోగొట్టుకుంటున్నారు. మామూలు వ్యక్తులను కూడా ఏవో చిన్న చిన్న వీడియోలు  తో ఒక్కసారిగా ఓవర్ నైట్ లో స్టార్ అయిపోతున్నారు.. అంతేకాదు గతంలో టిక్ టాక్ లో డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ జూనియర్ సమంత గా పేరు తెచ్చుకుంది అషూ రెడ్డి Ashu Reddy…పేరు ఇప్పుడు అందరికి తెలుసు..

తన వీడియోలతో అచ్చం సమంత లాగే అందరికీ దర్శనమిచ్చేది. దాంతో ఈమెను అందరూ జూనియర్ సమంత అని పిలవడం మొదలుపెట్టారు..అలా బాగా ఫెమస్ అయ్యింది అమ్మడు..సెలెబ్రేటీల ఇంటర్వ్యూలు కూడా బాగా పాపులారిటీని తెచ్చిపెట్టాయి.ఆ క్రేజ్ వల్లే ఈ బ్యూటీకి బిగ్ బాస్ హౌస్ లోకి కూడా అడుగుపెట్టే అవకాశం వచ్చింది. దాంతో బిగ్ బాస్ కి వెళ్లి ఆమె తన పర్ఫామెన్స్ చూపించింది. ఆమె తన గేమ్ కన్నా ఎక్కువగా అందాల ఆరబోతలోనే ఎక్కువగా దృష్టి పెట్టింది. ఇక ఈమె హౌస్ లో ఉన్నప్పుడు చాలామంది ఈమెను ఇదే విషయంలో విమర్శించారు. గేమ్ కన్నా ఎక్కువ తన అందం మీదే దృష్టి పెడుతుంది అంటూ ట్రోల్స్ చేశారు.

అలాగే హౌస్ లోకి వచ్చిన తర్వాత,బయటకు వచ్చిన తర్వాత కూడా అషూ రెడ్డి చాలా షోలలో కనిపించింది. అంతకన్నా ముందు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం నడిపించిందని వార్తలు కూడా వినిపించాయి.అంతేకాదు స్టార్ మాలో ప్రసారమయ్యే కామెడీ స్టార్స్ లో కూడా పటాస్ హరి తో ఈమె కలిసి చేసే హంగామా అంతా ఇంతా కాదు. అంతేకాదు వీళ్లిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అంటూ వార్తలు కూడా వినిపించాయి..హరి ఆమె పేరును గుండె పై టాటూగా వేయించుకున్నాడు.అందరూ అదే నిజమే అని అనుకున్నారు.

ఆ క్రమంలో తాజాగా కామెడీ స్టార్స్ లో హరి, అషూ రెడ్డి ఇద్దరు ఓ స్కిట్ చేశారు. ఇక ఆ స్కిట్ లో హరి మాట్లాడుతూ.. అషూ రెడ్డి నేను లవ్ చేసుకున్నాము.. మేమిద్దరం లేచిపోయి పెళ్లి కూడా చేసుకున్నాం. కొద్దిసేపటి క్రితమే మాకు పిల్లలు పుట్టారు అంటూ ఒక స్కిట్ చేశారు. అంతేకాదు అషూ రెడ్డిపై చేయి వేసి ఒక బేబీని తన చేతిలో పెట్టాడు.

- Advertisement -
Ashu Reddy Hari

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే వీళ్ళు చేసింది మొత్తం స్కిట్ వరకే అయినప్పటికీ అషూరెడ్డి ని మాత్రం నెటిజన్ లు ట్రోల్ చేస్తున్నారు. ఎప్పుడు ఛాన్స్ లు దొరికితే చాలు ఈమెపై ట్రోల్స్ చెయ్యడానికి రెడీగా ఉంటారు.. ఇక ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవ్వడంతో  చూసిన చాలా మంది నెటిజన్స్ పెళ్లి కాకుండానే తళ్లయ్యావా అంటూ దరిద్రంగా కామెంట్లు పెడుతున్నారు. ఇక మొన్నీమధ్య అషూ రెడ్డి రాంగోపాల్ వర్మ  ఇంటర్వ్యూ ఇండస్ట్రీలో ఎంత పెద్ద హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే..


Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here