Ashu Reddy : బరితెగించిన ఆర్జీవీ.. అషూరెడ్డి థైస్ చూస్తూ.. కాళ్లొత్తుతూ..

- Advertisement -

జూనియర్ సమంతగా పిలుచుకునే అషూరెడ్డి ( Ashu Reddy ) స్కిన్​ షోకు రోజురోజుకు హద్దూ అదుపు లేకుండా పోతోంది. రోజు రోజుకు బోల్డ్​నెస్ పెరిగిపోతోంది. ముఖ్యంగా కాంట్రవర్సికీ కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో అషూరెడ్డి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇద్దరూ కలిస్తే ఇక సోషల్ మీడియాకు మామూలు మసాలా కంటెంట్ దొరకదు. వీళ్లిద్దరు ఎప్పుడు కలిసినా ఓ సెన్సేషనే.

RGV and Ashu Reddy
RGV and Ashu Reddy

రీసెంట్​గా ఆర్జీవీ తన లేటెస్ట్​ మూవీ డేంజరస్​ ప్రమోషన్స్​లో బిజీగా ఉన్నాడు. ఇద్దరమ్మాయిల ప్రేమ కథతో వస్తోన్న సినిమా ఇది. అందుకు తగ్గట్టుగానే ఆర్జీవీ తన ప్రమోషన్స్​కి కూడా అమ్మాయిలనే వాడుతున్నాడు. ఇటీవలే కొందరు అమ్మాయిలతో ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో ఆర్జీవీతో పాటు ఆ అమ్మాయిలు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు మరో ఇంటర్వ్యూ ప్లాన్ చేశాడు.

RGV with nd Ashu Reddy

ఆర్జీవీ తన డేంజరెస్ మూవీ కోసం బోల్డ్ బ్యూటీ అషూరెడ్డితో కలిసి ఓ ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో.. ఫొటోస్ ఇప్పుడు ఇంటర్నెట్​ను షేక్ చేస్తున్నాయి. ఇప్పటికే అషూ రెడ్డి తన అందాలను హద్దులు చెరిపేస్తూ షో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఏ మాత్రం దాచుకోకుండా కుర్రాళ్లకు బ్యూటీ ట్రీట్ ఇస్తోంది అషూరెడ్డి. గ్యాప్ లేకుండా తన గ్లామర్​ షోతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. తన ఫొటోషూట్స్​తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

- Advertisement -
RGV and Ashu Reddy  photos

ఇప్పటికే ఒకటి రెండు సార్లు డైరెక్టర్​ రామ్‌గోపాల్‌ వర్మతో ఇంటర్వ్యూలు చేసింది అషూరెడ్డి. ఆ ఇంటర్వ్యూల్లోనూ ఆర్జీవీ అషూ అందాలను సరికొత్తగా ఆవిష్కరించాడు. కెమెరా యాంగిల్స్​ను చిత్రవిచిత్రంగా పెడుతూ అషూరెడ్డిని హాట్​గా చూపించాడు. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు కలిసి ఇంటర్నెట్​ను బ్లాస్ట్ చేశారు. తాజాగా వర్మ కాంపౌండ్‌లో మెరిసింది అషూరెడ్డి. వర్మ అషూరెడ్డి కాళ్లు పట్టుకుని కనిపించాడు. కెమెరాను అషూరెడ్డి బ్యాక్​లో పెట్టి బ్యాక్ నుంచి ఆమె థైస్ కనిపించేలా ఫోకస్ చేశాడు. ఆర్జీవీ అషూ ఎదుట కూర్చొని ఆమె థైస్​ను చూస్తూ.. కాళ్లొత్తుతున్నాడు. ఈ సీన్​ చూస్తుంటే ఆర్జీవీ ఏదో మైకంలో ఉన్నట్లు కనిపిస్తోంది.

RGV and Ashu Reddy stills
RGV and Ashu Reddy

ఇప్పుడు ఈ ఫొటోలు ఇంటర్నెట్​లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ ఫొటోలను అషూ రెడ్డి, రామ్‌గోపాల్‌ వర్మ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. డేంజరస్‌ వర్మతో డబుల్‌ డేంజరస్‌ అషూరెడ్డి అంటూ పోస్ట్ పెట్టిందీ బిగ్‌ బాస్‌ బ్యూటీ. వీరిద్దరు కలిసి ఓ బోల్డ్ ఇంటర్వ్యూ చేశారు. వర్మ రూపొందించిన `డేంజరస్‌` మూవీ ఈ నెల 9న విడుదల కాబోతుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా వర్మ ఇలా అషూరెడ్డితో కలిసి ఇంటర్వ్యూ చేశాడు.

ఈ ఫొటోలపై నెటిజన్లు తమదైన స్టైల్‌లో స్పందిస్తున్నారు. బోల్డ్​గా కామెంట్లు పెడుతున్నారు. ఎంత లెజెండరీ దర్శకుడు అయినా, ఏదో ఒకరోజు అమ్మాయి కాళ్ల వద్దకు రావాల్సిందే అనే సందేశాన్ని వర్మ జనానికి ఇస్తున్నాడని, ఎంత బతుకు బతికి చివరికి ఏ స్థితికి చేరావు వర్మ అని, ఫేమ్‌ కోసం ఇంత దిగజారిపోయావా? అని, అదృష్టం అంటే వర్మదే అని, ఇప్పుడు అనిపిస్తుంది ఒక్క రోజైనా వర్మలా బతకాలని అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here