Bigg Boss 6 Telugu : ఎవరూ ఊహించని రీతిలో బిగ్ బాస్ 6 విన్నర్..!

- Advertisement -

బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ( Bigg Boss 6 Telugu ) చివరి దశకు చేరుకుంది. లాస్ట్ ఫేజ్ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. ఈ వారం బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న కంటెస్టెంట్ల జర్నీని చూపించాడు బిగ్ బాస్. తమ జర్నీ చూసి కంటెస్టెంట్లు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. మొత్తం ఈ సీజన్ లో 21 మంది కంటెస్టెంట్లు హౌజ్ లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆరుగురు మిగిలారు. ఈ బుధవారం ఎలిమినేషన్ తో టాప్ 5లో నిలిచే వారెవరో తేలిపోతుంది. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరో ఈ ఆదివారం తెలిసిపోతుంది.

Bigg Boss 6 Telugu
Bigg Boss 6 Telugu

ఈ క్రమంలో శనివారం ఎపిసోడ్ కూడా చాలా కీలకం కానుంది. ఈ నాలుగు రోజులపాటు కూడా బిగ్ బాస్ భారీ స్థాయిలో రేటింగ్స్ అందుకునే అవకాశం కూడా ఉంది. నాగార్జున ఏ విధంగా టైటిల్ విన్నర్ ను ప్రకటిస్తాడు అనే దానికోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రతిసారి కూడా విన్నర్ ఎవరు అనే విషయంలో జనాల్లో ముందుగానే ఒక క్లారిటీ రావడం కూడా కామన్ గా మారిపోయింది. ఇక ఈసారి రేవంత్ కప్ గెలుస్తాడు అని కూడా టాక్ అయితే గట్టిగానే వినిపించింది.

Revanth

ఈ విషయాన్ని గతంలోని ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ల ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్లు పరోక్షంగానూ కన్ఫామ్ చేసేశారు. అసలే ఈ సీజన్ చెత్తగా సాగుతోందని, ఏ ఒక్కరూ పర్ఫెక్ట్‌గా లేరని, షో వేస్ట్ అని అనుకున్నారు. మొదటి నాలుగైదు వారాలు అయితే మరీ దారుణంగా నడిచింది.  ఇక మొదటి నుంచి రేవంత్ మాత్రం ఒకే టెంపోను మెయింటైన్ చేస్తూనే వచ్చాడు. అయినా కూడా రేవంత్‌ విన్నర్ అయ్యేందుకే ఎక్కువగా అవకాశాలున్నాయి. రేవంత్‌కు ఆల్రెడీ బయట ఫాలోయింగ్ ఉంది. బిగ్ బాస్ షోతో మరింత క్రేజ్ వచ్చింది. దీంతో రేవంత్ గెలుస్తాడని అందరికీ అర్థమైంది. 

- Advertisement -
Rohit and Revanth

కానీ అతనికి పోటీగా మరొక కంటెస్టెంట్ కూడా ఉండడంతో ఇప్పుడు గూగుల్లో అతని పేరు కనిపిస్తూ ఉండడం మరింత వైరల్ గా మారుతుంది. గూగుల్ లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విన్నర్ ఎవరు అని సెర్చ్ చేస్తే రోహిత్ సాహ్ని పేరు కనిపిస్తోంది. ఎక్కువగా అతని పేరు వైరల్ కావడంతో ఇప్పుడు గూగుల్ తల్లి అయితే రోహిత్ పేరును చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

Rohit Sahni

ఒక విధంగా రోహిత్ అయితే అంతా తీసి పారేసే మెటీరియల్ ఏం కాదు. అతను ఇంతవరకు వచ్చాడు అంటే మేటర్ ఉంది అని లెక్క. తప్పకుండా ఫైనల్లో పోటీని ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక శ్రీహాన్ ఆదిరెడ్డి కూడా టాప్ 5 లో ఎలా నిలదొక్కుకుంటాడరనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు హౌస్ లో మిగిలింది కేవలం ఇద్దరూ అమ్మాయిలు మాత్రమే. ఒకరు కీర్తి మరొకరు శ్రీ సత్య. మరి ఈ ఇద్దరిలో అయినా ఒకరు గెలిచి బిగ్ బాస్ తెలుగు టైటిల్ అందుకుంటారో లేదో తెలియాలంటే ఈ ఆదివారం వరకూ వెయిట్ చేయాల్సిందే. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here