Sir Movie Review : సౌత్ లో ప్రస్తుతం యూత్ లో ఒక రేంజ్ క్రేజ్ మరియు ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరు ధనుష్ .లుక్స్ పరంగా చాలా యావరేజి అబ్బాయి లాగానే కనిపిస్తాడు కానీ, టాలెంట్ విషయం లో మాత్రం ఇతను నేటి తరం స్టార్ హీరోలందరికంటే ఒక అడుగు ముందే ఉంటాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకీ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు కూడా దక్కింది.
ప్రభాస్ , రామ్ చరణ్,అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియన్ స్టార్ హీరోలు ఇప్పటి వరకు హాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వలేదు.కానీ ధనుష్ గత ఏడాది హాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టేసాడు.బాలీవుడ్ లో ఎలాగో ఆయనకీ సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి.ఇక బ్యాలన్స్ ఉన్నది తెలుగు లో మాత్రమే.అందుకే ఆయన మన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తో కలిసి ‘సార్’ అనే మూవీ చేసాడు.నేడు తెలుగు , తమిళం బాషలలో ఘనంగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందో లేదో చూద్దాము.
కథ :
మన దేశం లో ఎక్కడికి వెళ్లినా చదువు అనేది అందరికీ అందుబాటులో ఉండడం లేదు.స్తొమత లేని పేదవాడికి చదువు అనేది ఇప్పటికీ అందని ద్రాక్ష లాంటిదే.సమాజం లో ఉన్న ఈ సమస్యపై ఎప్పుడూ బాధపడుతూ ఉండే వ్యక్తి బాలు అలియాస్ బాలగంగాధర్ తిలక్.ఎందుకంటే అతను కేవలం ఒక సాధారణ డ్రైవర్ కొడుకు, చదువు అంటే ఎంతో పిచ్చి.. చదువులో అత్యున్నత స్థాయికి ఎదగాలనే కోరిక ఉన్న అతనికి కేవలం పేదరికం వల్ల వేరే స్థాయికి వెళ్లలేకపోతాడు.
అయితే తాను నేర్చుకున్న చదువు నలుగురికి ఉపయోగ పడేందుకు జూనియర్ లెక్చరర్ గా మారుతాడు. అలా ఒక సందర్భం లో సిరిపురం అనే ప్రభుత్వ కళాశాలలో చేరుతాడు. అక్కడ చదువుని వ్యాపారంగా మాత్రమే చూసే ఆ కాలేజీ యజమాని త్రిపాఠి (సముద్ర ఖని) ని ఎదిరించి పేదవాళ్లకు విద్యని అందించేలా బాలు ఎలాంటి ప్రయత్నాలు చేసాడు.. ఈ ప్రయాణం లో మీనాక్షి ( సంయుక్త మీనన్ ) పాత్ర ఏమిటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
డైరెక్టర్ వెంకీ అట్లూరి చాలా చక్కటి అంశాన్ని ఎంచుకొని దానిని కమర్షియల్ ఫార్మటు లో కాస్త వినోదం మరియు ఎమోషన్స్ ని జోడించి ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచె ప్రయత్నం అయితే చాలా గొప్పగా చేసాడు కానీ, ఫస్ట్ హాఫ్ విషయం లో స్క్రిప్ట్ ఇంకా బలంగా రాసుకొని ఉంది ఉంటే బాగుండేది అనిపించేది. స్లో గా సాగుతూ కొత్తదనం లేకుండా ఎదో అలా టైం పాస్ అయ్యే విధంగా ఉంటుంది ఫస్ట్ హాఫ్, కానీ సెకండ్ హాఫ్ మాత్రం ప్రారంభం నుండే ప్రేక్షకుల గుండెకి తాకే ఎమోషన్స్ తో అద్భుతమైన టేకింగ్ తో ముందుకి నడిపిస్తాడు.
కొన్ని సన్నివేశాలు మరియు ఆలోచింపచేసే డైలాగ్స్ ప్రేక్షకులకు కొంతకాలం గుర్తుండిపోతాయి. అంత చక్కగా రాసుకున్నాడు.ఎమోషన్స్ మొత్తం ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయ్యినప్పటికీ కొన్ని సన్నివేశాలు ఇంతకు ముందు ఎదో సినిమాలో చూసామే అన్నట్టుగా మనకి అనిపిస్తుంది. సినిమా మొత్తం పూర్తి అయ్యాక అంతా బాగానే ఉంది కానీ ఎక్కడో ఎదో మిస్ అయ్యింది అనే భావన వస్తుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది.అతనొక్క అద్భుతమైన నటుడు,ఈ సినిమాలో అయితే చాలా సన్నివేశాలను తన భుజాల పై వేసుకొని నడిపించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లోని కొన్ని సన్నివేశాల్లో ఆయన చేసిన ఎమోషనల్ యాక్టింగ్ ప్రేక్షకుల చేత కంటతడి పెట్టకుండా ఉండలేరు. ధనుష్ నటనకి మ్యాచ్ చేసే విధంగా హీరోయిన్ నటన కూడా ఉండాలి, కానీ సంయుక్త మీనన్ అలా నటించలేదనే చెప్పాలి.
చాలా సన్నివేశాల్లో ఈమె ఎక్స్ప్రెషన్స్ కూడా ఇవ్వలేకపోయింది. ఇక సాయి కుమార్, సముద్ర ఖని పాత్రలు రొటీన్ అయ్యినప్పటికే బాగానే ఉన్నాయి. హైపర్ ఆది కామెడీ పంచులు అక్కడక్కడా పేలాయి. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి మొదటి హీరో ధనుష్ అయితే,రెండవ హీరో మాత్రం జీవీ ప్రకాష్ కుమార్ అని చెప్పొచ్చు. చాలా సన్నివేశాల్లో వీళ్లిద్దరు పోటీపడినట్టు అనిపిస్తాది.
చివరి మాట :
సమాజం లో ఉన్న కీలకమైన అంశాలను కమర్షియల్ పద్దతిలో ఎంటర్టైన్మెంట్ మరియు ఎమోషన్స్ సమపాళ్లలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం లో డైరెక్టర్ వెంకీ అట్లూరి సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ స్లో గా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం మీరు పెట్టిన టికెట్ రేట్ కి న్యాయం చేస్తుంది.
రేటింగ్ : 2.75/5