Sreemukhi : జబర్దస్త్ కొత్త యాంకర్ శ్రీముఖినా.? మల్లెమాల ప్లాన్ ఏంటి.?

- Advertisement -

Sreemukhi : జబర్దస్త్ కార్యక్రమం ఏ రేంజ్ లో పాపులారిటీని దక్కించుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే.. కాగా గతంలో లాగా ఇప్పుడు ఆ రేంజ్ లో టిఆర్పి రేటింగ్ ను సొంతం చేసుకోలేక పోయింది.. జబర్దస్త్ షో మొదలైనప్పటి నుంచి యాంకర్స్ గా అనసూయ, రష్మీ కొనసాగుతున్నారు. ఇటీవల జబర్దస్త్ కు అనసూయ పర్మినెంట్ గా దూరమైంది..

Sreemukhi
Sreemukhi

ఆమె స్థానంలో సౌమ్య వచ్చింది. కాగా ఈ అమ్మడు కూడా అంతగా ఆకట్టుకోలేకపోతుందనే చెప్పొచ్చు.. మరోవైపు సౌమ్య జబర్దస్త్ కి దూరమవుతుందనే వార్తలు కూడా జోరు అందుకున్నాయి.. దాంతో సౌమ్య ప్లేస్ ను రీప్లేస్ చేసే యాంకర్ ఎవరంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుండగా.. శ్రీముఖి పేరు గట్టిగా వినిపిస్తోంది.. అవును మీరు వినింది నిజమే మల్లెమాల టీం త్వరలోనే జబర్దస్త్ కి యాంకర్ గా శ్రీముఖిని తీసుకొస్తారు అన్న సమాచారం గట్టిగా వినిపిస్తోంది.

sreemukhi goa photos

ప్రస్తుతం యాంకర్ శ్రీముఖి పలు షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ బిజీబిజీగా గడిపేస్తోంది. శ్రీముఖికి ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక ఆ పాపులారిటీ మరింత పెరిగింది అని చెప్పొచ్చు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక వరుస ఆఫర్లను కూడా అందుకుంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్ర కారుకి కునుకు లేకుండా చేస్తోంది.

- Advertisement -

ప్రస్తుతం శ్రీముఖికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని.. జబర్దస్త్ కి యాంకర్ గా వస్తే కచ్చితంగా జబర్దస్త్ రేటింగ్ మరింత పెరిగా అవకాశం ఉందన్న నేపథ్యంలో మల్లెమాల ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. జబర్దస్త్ షోకి శ్రీముఖి యాంకర్ గా వస్తే బాగుంటుందని ఇప్పటికే శ్రీముఖికి కాల్ చేసి మిగతా విషయాలు కూడా మాట్లాడుకున్నారని తెలుస్తోంది. మల్లెమాల టీంలో గతంలో పలు షోలను కూడా చేసింది శ్రీముఖి. దాంతో వెంటనే ఓకే చెప్పేసినట్లుగా సమాచారం. అయితే ఫైనల్ డెసిషన్ ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here