Dhanush : ప్రీమియర్ షోస్ తో ధనుష్ ‘సార్’ సంచలనం.. #RRR కి కూడా ఇలాంటి రికార్డు లేదు

- Advertisement -

Dhanush : తమిళ హీరో ధనుష్ తెలుగు లో చేసిన మొట్టమొదటి చిత్రం ‘సార్’ నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి తెలిసిందే.తమిళం లో వరుస విజయాలతో దూసుకుపోతూ, ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు ని గెల్చుకున్న ధనుష్ అంటే తెలుగు వాళ్లకి కూడా బాగా ఇస్తామని నిన్న రాత్రి ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో వేసిన ప్రీమియర్ షోస్ కి వచ్చిన రెస్పాన్స్ ని చూస్తే అర్థం అవుతుంది.

Dhanush sir movie
Dhanush

ఇది వరకు టాలీవుడ్ లో బాహుబలి పార్ట్ 2 సినిమాకి మినహా ఏ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ వెయ్యలేదు.’మేజర్’ చిత్రానికి వేశారు కానీ, చాలా తక్కువే.కానీ ‘సార్‘ మూవీ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలకు కలిపి 35 షోస్ ప్రదర్శించారట, ఈ షోస్ అన్నీ హౌస్ ఫుల్ అయ్యినట్టు తెలుస్తుంది.ఇది టాలీవుడ్ నయా రికార్డు అట.

Sir Movie
Sir Movie

హైదరాబాద్ లో సిటీ లో ఈ సినిమాకి నిన్న రాత్రి 15 కి పైగా ప్రీమియర్ షోస్ వేస్తే అన్నీ హౌస్ ఫుల్స్ అయ్యాయట.ఇప్పటి వరకు ఇలాంటి అరుదైన సంఘటన బాహుబలి 2 మరియు #RRR వంటి చిత్రాలకు కూడా జరగలేదు.ప్రీమియర్ షోస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి , ఇక టాలీవుడ్ సినిమాలు కూడా భవిష్యత్తు లో ప్రీమియర్ షోస్ ట్రెండ్ ని అనుసరిస్తాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు.

- Advertisement -
Dhanush

అదే కనుక జరిగితే పవన్ కళ్యాణ్ , ప్రభాస్ మరియు జూనియర్ ఎన్టీఆర్ వంటి క్రేజీ స్టార్ హీరోల సినిమాలకు కనీవినీ ఎరుగని ఓపెనింగ్స్ వస్తాయి.అలా ధనుష్ తన మొదటి తెలుగు సినిమాతోనే ఎవ్వరు ఊహించని విధంగా ప్రీమియర్ షోస్ ద్వారా సరికొత్త ట్రెండ్ ని సృష్టించాడు.సినిమాకి పాజిటివ్ రివ్యూస్ కూడా బాగానే వచ్చాయి కాబట్టి కచ్చితంగా ధనుష్ ఖాతాలో మరో సూపర్ హిట్ గా చెప్పుకోవచ్చు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here