2023 ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజిల్స్ వేదికగా అట్టహాసంగా జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ తారలు తరలివచ్చారు. డిఫరెంట్ ఔట్ ఫిట్స్ లో అందాలు ఆరబోస్తూ రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. ఆస్కార్ వేదికపై తెలుగు సినిమా పాట సందడి చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట లైవ్ పర్ఫామెన్స్ జరిగింది. ఈ పాటను ఆస్కార్ వేదికపై బాలీవుడ్ దివా దీపికా పడుకోన్ ఇండ్రడ్యూస్ చేసింది. ఆ పాట నేపథ్యాన్ని, అవార్డుల వేడుకకు హాజరైన వారికి వివరించింది.
“ఉర్రూతలూగించే కోరస్.. దుమ్మురేపే బీట్స్.. కిల్లర్ డ్యాన్స్ మూవ్స్ నెక్స్ట్ వచ్చే పాటను గ్లోబల్‌గా పాపులర్ చేశాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఓ కీలక సీన్లో ఈ పాట వస్తుంది. భారతీయ పోరాట యోధులు కొమురంభీం, అల్లూరి సీతారామ రాజుల మధ్య ఉన్న స్నేహబంధాన్ని ఈ సినిమాలో చూపించారు. ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ పాట రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు యూట్యూబ్, టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో లక్షల కోట్ల వ్యూస్ సంపాదించింది. ఇప్పుడు ఏకంగా ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన మొట్టమొదటి ఇండియన్ సాంగ్‌గా చరిత్ర సృష్టించింది. మీకు నాటు గురించి తెలుసా..? ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఇప్పుడు నాటు నాటు పాట లైవ్ పర్ఫామెన్స్ రాబోతోంది. చూసి ఎంజాయ్ చేయండి.” అంటూ ఆస్కార్ వేదికపై దీపికా పడుకోన్ నాటు నాటు పాటను ఇంట్రడ్యూస్ చేశారు.
ఆస్కార్-2023 వేడుకల్లో తెలుగు పాట ‘నాటు నాటు’ అదరగొట్టింది. ఈ పాటను ఒరిజినల్‌గా పాడిన గాయకులు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ లైవ్‌లో పాడారు. వారి పాటకు వెస్ట్రన్ డ్యాన్సర్ తమ డ్యాన్స్‌తో ఉర్రూతలూగించారు. ఈ పాట ప్రదర్శన సమయంలో ఆస్కార్ వేడుకకు వేదికైన డాల్బీ థియేటర్ మొత్తం కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది. పాట పూర్తవ్వగానే అక్కడున్న తారలంతా లేచి నిలబడి మరీ చప్పట్లు కొట్టారు. మొత్తానికి ఆస్కార్ వేదికను తెలుగు పాట షేక్ చేసింది. డాల్బీ థియేటర్లో నాటు నాటు దుమ్ము రేపింది. నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కింది. ఎంతో ఉత్కంఠగా వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకుల చిరకాల కల నెరవేరింది.
తెలుగు సినిమా ఆస్కార్‌ను ముద్దాడింది బాలీవుడ్ గడ్డపై తెలుగు సినిమా తన సత్తా చాటింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ దక్కించుకుంది. ఆస్కార్‌ను దక్కించుకున్న తొలి భారతీయ గీతంగా నాటునాటు రికార్డులకు ఎక్కింది. హాలీవుడ్ పాటలను తలదన్నుకుంటూ చివరకు వరకు చేరిన నాటునాటు విజయకేతనం ఎగరవేసింది.
ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి కుమారుడు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ పాటను చంద్రబోస్ రచించగా.. కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. నాటునాటు పాటకు ఎన్టీఆర్, రామ్‌చరణ్ అదిరిపోయే స్టెప్పులు వేశారు. దీనికి ప్రేమ్‌రక్షిత్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ ఆవార్డులు సాధించింది.