Actress In Bikini : బికినీ ధరించి వివాదంలో చిక్కుకున్న హీరోయిన్లు వీళ్లే..!

actress in bikini


Actress In Bikini : సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఒక ట్రిగ్గర్ బాక్స్ వస్తుంది. ఈ సినిమాలో అన్ని పాత్రలు కేవలం కల్పితం మాత్రమే.. ఎవరినీ ఉద్దేశించినవి కావు అని. అయినా కూడా చాలా సినిమాలు వివాదాలు ఎదుర్కొంటాయి. ముఖ్యంగా అందులో ఏ కులం, మతానికి సంబంధించిన అంశాలు ఉంటే ఈ గోల మామూలుగా ఉండదు. ఇక సినిమాల్లో హీరోయిన్లు గ్లామరస్​గా కనిపించడం.. హీరోహీరోయిన్ల మధ్య ఇంటిమేట్ సీన్లు ఉండటం సాధారణం.

బాలీవుడ్​లో ఈ ఇంటిమసీ కాస్త శ్రుతి మించుతుంది కూడా. ఇది కొన్నిసార్లు వివాదాలు దారితీస్తుంది. ప్రస్తుతం దీపికా పదుకొణె, షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్​ సినిమాలోని బేషరమ్ రంగ్ సాంగ్​ పరిస్థితి అదే. ఈ పాటలో దీపికా-షారుఖ్​ల మధ్య గాఢమైన రొమాన్స్ ఉందంటూ పలు సంఘాలు గొడవలు చేస్తున్నాయి. ఏకంగా ఓ మంత్రి తమ రాష్ట్రంలో ఈ సినిమాను బాయికాట్ చేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు.

అయితే ఈ సాంగ్ ఇంతగా వివాదానికి దారితీయడానికి గల కారణం ఈ పాటలో దీపిక ఆరెంజ్ కలర్ బికినీ ధరించడమే. కాషాయ రంగు బికినీ ధరించడంపై దీపికాయే కాదు ఇప్పటికే పలువురు హీరోయిన్లు కూడా ఇలాంటి వివాదాలు ఎదుర్కొన్నారు. మరి వాళ్లెవరో ఓసారి చూసేద్దామా..

actress in bikini
actress in bikini

‘పఠాన్’లోని ‘బేషరమ్ రంగ్’ పాటకు ముందు దీపికా పదుకొణె ఆరెంజ్ కలర్ బికినీలో పోజులిచ్చింది. గెహరాయియా సినిమా ప్రమోషన్స్ సమయంలో, ఆమె ఒక నీటి అడుగున ఫోటోషూట్ చేసింది, అందులో ఆమె ఆరెంజ్ బికినీలో కనిపించింది. అప్పుడు ఈ సంఘటన వివాదానికి దారి తీసింది.

Katrina Kaif

సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ‘బార్ బార్ దేఖో’ సినిమాలోని ఒక పాటలో కత్రినా కైఫ్ కుంకుమ పువ్వు బికినీ ధరించింది. ఇందులో చాలా స్టైలిష్‌గా, గ్లామరస్‌గా కనిపించింది. ఇది కూడా అప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసింది.

AvneetKaur

సోషల్ మీడియా సంచలనం అవనీత్ కౌర్ కూడా ఆరెంజ్ కలర్ బికినీలో సోషల్ మీడియాలో కనిపించింది. మాల్దీవుల వెకేషన్‌లో ఆమె ఈ బికినీ ధరించింది. ఈ బికినీపైనా నెగిటివ్ కామెంట్స్ గుప్పుమన్నాయి.

Disha Patani

బాలీవుడ్ బికినీ బ్యూటీ దిశా పటానీ, తరచూ వెకేషన్స్​కు వెళ్తూ బికినీలు ధరించి గాటైన పోజులిస్తూ ఉంటుంది. రీసెంట్​గా బికినీలో దిగిన కొన్ని ఫొటోలు పంచుకుంది దిశ. అందులో ఆమె సాఫ్రాన్ కలర్ బికినీ ధరించింది.

పంజాబీ నటి , మోడల్ నేహా మాలిక్ కూడా తన బికినీ లుక్‌తో వైరల్‌గా మారింది. నటి మే నెలలోనే తన కొన్ని చిత్రాలను పంచుకుంది. ఇందులో ఆమె ‘ సాఫ్రాన్ కలర్ ‘ బికినీలో కనిపించింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా చర్చనీయాంశమయ్యాయి.

Priyanka Chopra

ప్రియాంక చోప్రా 2019లో తన బీచ్ వెకేషన్‌లో తన ఫోటోను షేర్ చేసింది. ఇందులో ఆమె ఆరెంజ్ బికినీలో కనిపించింది. దీనిపైనా కాస్త ఎక్కువ చర్చే జరిగింది.

Alia Bhatt

ఆలియా భట్ తన 29వ పుట్టినరోజు సందర్భంగా ఆలియా భట్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె బీచ్‌లో ఆరెంజ్ బికినీ ధరించింది. దీనిపైనా సోషల్ మీడియాలో తెగ కామెంట్లు వచ్చాయి.

Tags: