Waltair Veerayya : సక్సెస్ మీట్ లో ‘వాల్తేరు వీరయ్య’ టీమ్ కు చిరంజీవి సర్ ప్రైజ్.. అదిరిపోయిందిగా

- Advertisement -

Waltair Veerayya : పూనకాలు లోడింగ్ అంటూ మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యగా ఈ సంక్రాంతి బరిలో దిగారు. బాబీ డైరెక్షన్ లో శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ సినిమా శుక్రవారం విడుదలై తెలుగు ప్రేక్షకుల నీరజనాలు అందుకుంటోంది. ఓ ఫ్యాన్ గా బాబీ.. మెగాస్టార్ ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే చూపించారని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. చాలా ఏళ్ల తర్వాత చిరంజీవిని పక్కా మాస్ పాత్రలో చూశామని సంబురపడుతున్నారు. రిలీజైన ఒక్కరోజులోనే వసూళ్ల వర్షం కుపిస్తున్నాడు వాల్తేరు వీరయ్య.

waltair veerayya

ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి చిత్రబృందం హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే సక్సెస్ మీట్ కూడా ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్ లో ఈ సినిమాకు కష్టపడిన వారందరికీ మెగాస్టార్ ఓ సూపర్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆ సర్ప్రైజ్ చూసి డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, రవితేజతో పాటు అక్కడున్న వాళ్లంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంతకీ చిరు ఇచ్చిన సర్ ప్రైజ్ ఏంటంటే..

ఈ సినిమాకు సంబంధించి చాలా ఈవెంట్స్ జరిగాయి. ప్రతి ఈవెంట్ లో ఈ సినిమాకు సంబంధించిన వాళ్లందరి పట్ల నాకున్న అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నాను. ఇవాళ ఏం మాట్లాడాలా అని అప్పటి నుంచి ఆలోచిస్తూనే ఉన్నాను. ఈ సినిమాకు ఎంతో మంది కష్టపడ్డారు. వాళ్ల కష్టం చూస్తుంటే చాలా ముచ్చటేసింది. ఈ సినిమా గురించి అందరూ బాగుందని చెబుతుంటే ఎంతో సంతోషంగా ఉంది.

- Advertisement -

వాల్తేరు వీరయ్య’ విజయంతో నా మాటలు కొరవడ్డాయి. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. మనం మాట్లాడటం ఆపేసి ప్రేక్షకులు మాటలు విద్దాం. ప్రేక్షకుల ఉత్సాహమే మన ఇంధనం. సినిమా యూనిట్ అంతా థియేటర్లకు వెళ్లాలి. నేను కష్టపడలేదు, నా బాధ్యతగా అనుకుని పనిచేశా. కష్టం నాది, రవితేజది కాదు.. సినిమా బాగా రావాలని పనిచేసిన వారిది. వాల్తేరు వీరయ్య విజయం సినిమాకు పనిచేసిన కార్మికులది. మన మీదతో జాలితో కాదు… సినిమాపై ప్రేమతో కష్టపడ్డ కార్మికుల కోసం ప్రేక్షకులు సినిమా చూడాలి. విజయాలు వస్తుంటాయి పోతుంటాయి, కార్మికుల కష్టం తెలియాలి.

ఈ సినిమా వెనక ఉన్న కష్టం నాదో రవితేజదో కాదు. ఈ సినిమా కోసం కష్టపడ్డ కార్మికులది. ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ కార్మికులు పడ్డి కష్టాన్ని కళ్లారా చూశాను. వారి కష్టాన్ని ప్రపంచానికి చూపించాలని ఆ షాట్స్ ను నా మొబైల్ తో నేనే స్వయంగా షూట్ చేశాను. ఆ కష్టాన్ని ప్రేక్షకులు చూస్తే.. వాళ్లని మనం సినిమా చూడమని అడగనవసరం లేదు. ఈ సినిమా కోసం మనం పడిన కష్టాన్ని అర్థం చేసుకుని వాళ్లే థియేటర్లకు వస్తారు. అని తాను తీసిని వీడియోను సక్సెస్ మీట్ లో ప్రసారం చేసి వాల్తేరు వీరయ్య చిత్రబృందానికి చిరంజీవి సర్ ప్రైజ్ ఇచ్చారు. 

ఈ వీడియో చూసిన చిత్రబృందం చాలా ఎమోషనల్ అయింది. డైరెక్టర్ బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్ వీడియో చూసి ఎమోషనల్ అయి చిరు కాళ్లకు నమస్కరించారు. ఇక మాస్ మహారాజ రవితేజ చిరంజీవిని గట్టిగా కౌగిలించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు మెగాస్టార్ ను తెగ పొగిడేస్తున్నారు. కష్టం విలువ తెలిసిన వాడికే ఎదుటి వాళ్ల కష్టం కనిపిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here