Unstoppable 2 : బాలయ్య, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ నుంచి మరో అప్డేట్.. వీడియో రిలీజ్..

- Advertisement -

బాలయ్యకు సినిమాల కన్నా Unstoppable 2 ద్వారా బాగా పాపులారిటీని సంపాదింంచుకున్నాడు.. కామెడీ పంచులతో యాంకరింగ్‏కు కొత్తదనం తీసుకువచ్చారు. మొదటి సీజన్ సూపర్ డూపర్ హిట్ కాగా.. ఇక ఇప్పుడు రన్ అవుతున్న సీజన్ 2 బ్లాక్ బస్టర్ హిట్. సినీ, రాజకీయ ప్రముఖులతో బాలయ్య చేసే ఇంటర్వ్యూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, శర్వానంద్, అడివిశేష్ వచ్చి సందడి చేశారు. ఇక హీరో ప్రభాస్ వచ్చిన ఎపిసోడ్ గురించి చెప్పక్కర్లేదు. డార్లింగ్ ఫ్యాన్స్ దెబ్బకు రికార్డ్స్ బద్దలయ్యాయి.

Unstoppable 2
Unstoppable 2

ఈ మాసివ్ ఎపిసోడ్‏కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు మరో ఎపిసోడ్ కోసం ఆడియన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు..అదే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్..ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ పూర్తీ అయిన విషయం తెలిసిందే..ఇందుకు సంబంధించిన ఫోటోస్ కూడా సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఇక ఎపిసోడ్ గ్లింప్స్, ప్రోమో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవన్ అభిమానులకు సంక్రాంతి కానుక ఇచ్చారు మేకర్స్. పండగా సందర్భంగా వీరి ఎపిసోడ్ కు చెందిన ఓ క్రేజీ వీడియో షేర్ చేశారు..

ఇకపోతేఫ్ వీరిద్దరి గురించి ఇంట్రెస్టింగ్ మోషన్ పోస్టర్ వీడియో డిజైన్ చేశారు. పవర్ స్టార్ మేనియా ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. పవర్ స్ట్రోమ్ లోడింగ్ సూన్ అంటూ పవన్ ఎపిసోడ్ స్పెషల్ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.. బాలయ్య, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఇది మంచి కిక్ ఇచ్చే న్యూస్ అనే చెప్పాలి.. మరి ఈ ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమో, ఫుల్ ఎపిసోడ్‏కు సంబందించిన వీడియో కోసం ఫ్యాన్స్ వెయిటింగ్.. ఇప్పుడు రిలీజ్ అయిన వీడియోను ఒకసారి చూసేయ్యండి…

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here