Cinema Gossips : ఈ వయస్సులో ఆ హీరోయిన్ మూడో పెళ్ళి చేసుకుందా?

- Advertisement -

Cinema Gossips : ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో చాలా మంది వయస్సుతో సంబంధం లేకుండా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. ఇదే ట్రెండ్ అవుతుంది.. ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో వున్న హీరో, హీరోయిన్లు సైతం వరుస పెళ్ళిళ్ళు చేసుకుంటూన్నారు.. మొన్నీమద్య తెలుగు స్టార్ హీరో నరేష్ కూడా నటి పవిత్రను నాలుగో పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నారు.. ఇప్పుడు మరో నటి మూడో పెళ్ళి చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి..ఆమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం…

సహజనటి జయసుద గురించి అందరికి తెలుసు..ఈమె మూడో పెళ్ళి చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన జయసుధ రీ ఎంట్రీలో స్టార్ హీరోలకు తల్లిగా అద్భుతమైన పాత్రలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.. ఇక ప్రస్తుతం ఆమె వారసుడు సినిమాలో విజయ్ కు తల్లిగా నటించింది. కాగా, జయసుధ రెండో భర్త నితిన్ కపూర్ 2017 లో మృతి చెందిన విషయం తెల్సిందే. కొన్ని కారణాల వలన నితిన్ సూసైడ్ చేసుకొని మృతి చెందాడు. ఇక అప్పటి నుంచి ఆమె కొడుకులతో కలిసి ఉంటుంది.. ఇక గతేడాది జయసుధ అనారోగ్య కారణాలతో అమెరికా వెళ్లి చికిత్స పొంది మరలా ఇండియాకు తిరిగి వచ్చింది. చికిత్స సమయంలో అసలు గుర్తుపట్టలేని స్థితిలో మారిపోయిన జయసుధ.. ఇప్పుడిప్పుడే తన మునుపటి రూపానికి వస్తోంది.

Cinema Gossips
Cinema Gossips

గత కొన్ని రోజులు క్రితం ఆమె ఒక బిజినెస్ మ్యాన్ ను మూడో వివాహం చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏ ఈవెంట్ కు కానీ, ఏ ఫంక్షన్ కు కానీ వెళ్లిన జయసుధ, అతనితోనే కలిసివస్తోంది. దీంతో ఆమె అతనిని వివాహం చేసుకొని ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొస్తున్నాయి. మొన్నటికి మొన్న ఆలీ కూతురు పెళ్ళిలో ఈ జంట సందడి చేసింది. ఇక నిన్నటికి నిన్న వరిసు ఈవెంట్ లో కూడా జయసుధ అతనితోనే కలిసివచ్చింది.

- Advertisement -

దీంతో ఈ జంట ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నారని చెప్పుకొస్తున్నారు. ఇక జయసుధ మొదటిసారి కాకర్లపూడి రాజేంద్రప్రసాద్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడింది. మనస్పర్థల కారణంగా ఈ జంట విడిపోయారు. ఆ తరువాత ఆమె బాలీవుడ్ స్టార్ హీరో జితేంద్ర కపూర్ కజిన్ నితిన్ కపూర్ ను వివాహమాడింది.. ఆయన చనిపొయారు.. దాంతో ఇప్పుడు 64 ఏళ్ళ వయస్సులో బిజినెస్ మ్యాన్ ను మూడో పెళ్లి చేసుకుందని అంటున్నారు. మరి ఈ వార్తలో నిజమేంత వుందో తెలియాలంటే జయసుధ క్లారిటీ ఇవ్వాల్సిందే..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here