Shah Rukh Khan : తన ఫస్ట్ గర్ల్‌ఫ్రెండ్ ఎవరో చెప్పేసిన షారుక్ ఖాన్‌.. భార్య రియాక్షన్ ఏంటంటే..?

- Advertisement -

బాలీవుడ్ బాద్‌షా Shah Rukh Khan . ఈ హీరోకు ఫ్యాన్స్ కాదు డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. సాధారణ ప్రేక్షకులే కాదు సినిమా ఇండస్ట్రీలో.. అది కూడా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఏకైక హీరో కింగ్ ఖాన్. ఇక ఈ హీరో మూవీ వస్తుందంటే అభిమానుల హడావుడి మామూలుగా ఉండదు. కానీ గత ఐదేళ్ల నుంచి షారుక్ తెరపై కనిపించలేదు. అంతకుముందు చేసిన సినిమాలు కూడా ఫ్లాపే. దీంతో షారుక్ మళ్లీ ఎప్పుడు తెరపై కనిపిస్తాడా అని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు.

Shah Rukh Khan
Shah Rukh Khan

ఎట్టకేలకు ప్రేక్షకుల నిరీక్షణ ఫలించింది. దాదాపు ఐదేళ్ల తర్వాత బాద్‌షా షారుక్‌ ఖాన్‌ పఠాన్ మూవీతో వెండితెరపై కనిపించడానికి రెడీ అయ్యాడు. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బాలీవుడ్ దివా దీపికా పదుకొణె హీరోయిన్​. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది. సూపర్ పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్సులతో.. మోతాదుకు మించిన రొమాన్స్‌తో ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Gauri khan and sharukh khan

మరో కొద్దిరోజుల్లో సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్​లో జోరు పెంచింది చిత్రబృందం​. పఠాన్ మూవీ ప్రమోషన్స్‌లో హీరో షారుక్ ఖాన్‌ కూడా బిజీ అయ్యారు. అయితే షారుక్ సోషల్ మీడియాలో డైరెక్ట్‌గా ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌లో పఠాన్‌పై పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. షారుక్ ఖాన్- ట్విటర్..

- Advertisement -

డెడ్లీ కాంబినేషన్ అన్న సంగతి తెలిసిందే. ఈ స్టార్ హీరో ట్విటర్‌లో ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కొందరు క్రేజీ ఫ్యాన్స్ అడిగే నాటీ ప్రశ్నలకు బాద్‌షా కూడా నాటీ రిప్లై ఇస్తుంటాడు. అందుకే షారుక్ ట్విటర్ సంభాషణ అంటే ఫ్యాన్స్‌కు భలే ఇష్టం. ఇవాళ కూడా షారుక్​ ట్విటర్​లో తన అభిమానులతో ముచ్చటించారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్​లో సమాధానం ఇచ్చారు. ఆ సంగతులేంటో చూద్దామా మరి.

పఠాన్‌ సినిమాకు ఎంత పారితోషికం తీసుకున్నారు?

షారుక్‌: సినిమాకు అంగీకరించినప్పుడు ఎంత అన్నారో.. అంతే తీసుకున్నా.

మీ కుటుంబం పఠాన్‌ సినిమా చూసిందా? వాళ్ల రియాక్షన్‌ ఏంటి?

షారుక్‌: ఇప్పటి వరకు టెక్నిషియన్స్‌ మాత్రమే పఠాన్ చూశారు. ఇంకెవ్వరూ చూడలేదు.

మీరు మీ కోపాన్ని ఎలా కంట్రోల్‌ చేసుకుంటారు?

షారుక్‌: నేను నా కోపాన్ని నియంత్రించుకోగలుగుతున్నా. దీన్ని నాకు కాలమే నేర్పింది.

మీకు హాకీ అంటే ఇష్టమేనా? ఒడిశాలో జరిగే హాకీ ప్రపంచకప్‌ చూడటానికి వస్తారా?

షారుక్‌: నాకు రావాలని ఉంది. కానీ పనిలో బిజీగా ఉన్నందు వల్ల రాలేకపోతున్నా.

పఠాన్‌లో మీ లుక్‌ కోసం ఎన్నిరోజులు వ్యాయామం చేశారు?

షారుక్‌: 6 నెలలు పట్టింది ఆ లుక్‌ రావడానికి.

మీ మొదటి ప్రేయసి ఎవరు?

షారుక్‌: నా భార్య గౌరి. తనే నా మొదటి ప్రేయసి.

సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి?

షారుక్‌: మీ రహస్యాలను, లోపాలను ఎవ్వరితో పంచుకోకండి. అప్పుడు సంతోషంగా ఉంటారు.

పఠాన్‌ షూటింగ్‌ జరుగుతున్నప్పుడు ఎలా అనిపించింది?

షారుక్‌: ఈ సినిమా కోసం చాలా మంది కష్టపడ్డారు. వాళ్లు ఇప్పటికీ పగలు..రాత్రి అనే తేడా లేకుండా పనిచేస్తున్నారు. వాళ్లందరితో షూటింగ్‌ సమయంలో ఎంజాయ్‌ చేశాను.

సిద్ధార్థ ఆనంద్‌ దర్శకత్వంలో నటించడం ఎలా అనిపించింది?

షారుక్‌: చాలా బాగుంది. షూటింగ్‌ సమయమంతా సరదాగా గడిచింది.

2024లో ఎన్ని సినిమాల్లో చూడొచ్చు మిమ్మల్ని?

షారుక్‌: దీనికి సమాధానం మరికొన్ని రోజుల్లో చెబుతాను.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here