Chiranjeevi : ‘వాల్తేరు వీరయ్య ‘ టైటిల్ సాంగ్‌..ఫ్యాన్స్ కు పండగే పండగ..

- Advertisement -

Chiranjeevi : టాలివుడ్ లో మెగాస్టార్ చిరంజీవికి ఎప్పటికి ప్రత్యేక స్థానం ఉంటుంది.. ఈ మధ్య రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన బ్రేక్ లేకుండా వరుస సినిమాలను చేస్తూ వస్తున్నారు.ఇటీవల గాడ్ ఫాదర్ తో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు..ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమానే ‘వాల్తేరు వీరయ్య ‘ ఈ సినిమాను బాబీ దర్శకత్వం రూపొందిస్తున్నారు.ఇక ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు రెండు పాటలు విడుదల కాగా అవి ప్రేక్షకులను ఎంతగానో ఆలరించాయి..ఆ పాటలు సినిమాకు హైలెట్ గా నిలిచాయి… విడుదల అయిన కొద్ది రోజులకే యూట్యూబ్ తో మాంచి వ్యూస్ తో దూసుకు పోతున్నాయి..

Megastar Chiranjeevi
Megastar Chiranjeevi

ఈ మూడవ పాట కోసం కూడా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూడగా.. అది రెండు పాటలకు మించి ఉండడం ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అని చెప్పడానికి నిదర్శనం గా మారుతుంది..మరి సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మెగాస్టార్ చిరంజీవి నటించిన గత రెండు మూడు సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం అలరించక పోవడం తో ఈ సినిమా పట్ల అందరూ, మెగా ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

Veerayya
Veerayya

మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించగా ఈ చిత్రంతో పాటు బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీరసింహారెడ్డి చిత్రం కూడా విడుదల కాబోతూ ఉండడం విశేషం. ఈ రెండు సినిమాలను కూడా ఒకే నిర్మాణ సంస్థ నిర్మించడం మరింత విశేషం. ఈ నేపథ్యంలో ఈ రెండు చిత్రాలు ఆ నిర్మాణ సంస్థకు ఎలాంటి కలెక్షన్ ను తెచ్చిపెడతాయో చూడాలి.సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రం పట్ల జనాల్లొ అంచనాలు వేరే స్థాయిలో ఉన్నాయని చెప్పాలి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్ లో ఉండడం మెగా అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తుంది.. ఇప్పటివరకు పాజిటివ్ టాక్ ను అందుకున్న సినిమా విడుదలైయ్యాక ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి…

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here