Chay and Ashritha : నాగ చైతన్యతో వెంకటేశ్ కూతురు కబుర్లు.. ‘నా బావ’ అంటూ సందడిChay and ashritha : టాలీవుడ్ సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేశ్ అంటే ఇష్టపడని వారుండరు. ఫ్యామిలీ ఆడియెన్స్​ను తెగ అలరించిన హీరోల్లో నంబర్ వన్​ ప్లేస్​లో ఉంటారు వెంకీమామ. ముఖ్యంగా ప్రతి ఇంట్లో తల్లిదండ్రులను మీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగితే ముక్తకంఠంతో ఇద్దరూ చెప్పే పేరు ఒకటే. అదే దగ్గుబాటి వెంకటేశ్. హీరోగా తనదైన స్టైల్​లో అటు క్లాస్.. ఇటు మాస్ ప్రేక్షకులను అలరించారు వెంకీ.

Naga Chaitanya and Ashritha
Naga Chaitanya and Ashritha

తెరపై ఎంత జాలీగా నటించినా.. ఎంత కామెడీ చేసినా.. నిజ జీవితంలో మాత్రం వెంకీమామ చాలా సైలెంట్. చాలా తక్కువగా మాట్లాడతారు. చాలా జోవియల్​గా కూడా ఉంటారు. వెంకీ మామ తన పర్సనల్​ లైఫ్​ని లైమ్​లైట్​కి ఎప్పుడూ దూరంగా ఉంచుతారు. తన కుటుంబ సభ్యులు ఎక్కువగా పబ్లిక్​లోకి రారు. ఇక వెంకీ మామకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడన్న సంగతి అందరికీ తెలిసిందే.

Chay and ashritha
Chay and ashritha

వెంకటేశ్ పెద్ద కుమార్తె ఆశ్రిత దగ్గుబాటి వివాహం చేసుకుని బార్సిలోనాలో తన భర్తతో ఉంటుంది. స్వతహాగా ఫుడీ అయిన ఆశ్రితకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. పెళ్లి తర్వాత బార్సిలోనాలో కుకింగ్ క్లాస్​లకు వెళ్లేది. ఆ తర్వాత ఫుడ్​ వ్లాగర్​లో తన కెరీర్ స్టార్ట్ చేసింది. ‘ఇన్ఫినిటీ ప్లాటర్‌’ అనే తన యూట్యూబ్‌ ఛానల్‌ వేదికగా ఆమె ఎన్నో కొత్త వంటలను పరిచయం చేస్తూ ఉంటుంది. బార్సిలోనాలోని రకరాల వంటలను ఇండియాకు ఇంట్రడ్యూస్ చేసింది ఆశ్రిత.

ఇక అక్కడి వాళ్లకు మన ఇండియన్ వంట రుచి చూపిస్తోంది ఆశ్రిత. వీకెండ్ వచ్చిందంటే చాలు తన సరికొత్త వంటకాలతో వ్యూయర్స్​ని పలకరిస్తుంది. ప్రస్తుతం బార్సిలోనా నుంచి ఇండియాకు వచ్చింది ఆశ్రిత. గత నెల రోజులుగా తన కుటుంబంతో గడుపుతున్న ఆశ్రిత.. ఇండియాలో ముఖ్యంగా హైదరాబాదీ వంటకాల గురించి తన ఫుడ్ వ్లాగ్​లో వీడియోస్ చేస్తోంది.

 ఈ క్రమంలోనే నటుడు, తన బావ నాగ చైతన్య కు సంబంధించిన ఓ క్లౌడ్‌ కిచెన్‌ను చూపించింది. హైదరాబాద్​లో ది ఫేమస్ షోయూ కిచెన్​లో వంటకాలను పరిచయం చేసింది ఆశ్రిత. తన బావ నాగ చైతన్యతో కలిసి ఈ వీడియోలో సందడి చేసింది. ఈ వీడియోలో.. అక్కడ తయారయ్యే ఆహారం గురించి నాగ చైతన్య వివరిస్తూ, ఆశ్రిత అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానమిస్తూ కనిపించాడు.

అనంతరం, ఆశ్రితకు చైతూ అక్కడి ఫుడ్‌ రుచి చూపించారు. ఆ టేస్ట్‌కు ఫిదా అయిన ఆమె చెఫ్‌లను అభినందించారు. ఇక ఇద్దరూ కాసేపు జపనీస్ వంటకమైన సూషీ తయారు చేశారు. సూషీ మేకింగ్​లో ఇద్దరూ కాంపిటీషన్ పెట్టుకున్నారు. ఇద్దరిలో ఆశ్రితయే బాగా చేసిందని నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఇక నాగచైతన్య కూడా చెఫ్ కాకపోయినా బాగానే చేశాడని చెప్పుకొచ్చారు.

ఇక ఈ వీడియో ప్రారంభంలో.. ‘నా బావ’ అంటూ నాగ చైతన్యను ఆశ్రిత ఆహ్వానించడంపై నెటిజన్లు స్పందించారు. ‘క్యూట్‌’, ‘మీ ఇద్దరిని ఒకే వీడియోలో చూడడం ఆనందంగా ఉంది’, ‘మీ ఫ్యామిలీ నుంచి ఇలాంటి వీడియోలు మరిన్ని ఆశిస్తున్నాం’ అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్​లో ఇన్ఫినిటీ ప్లాటర్ యూట్యూబ్ ఛానెల్​లో అందుబాటులో ఉంది.