పవన్ కళ్యాణ్ లేకుండానే ‘బ్రో’ ప్రొమోషన్స్..! ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘బ్రో’ గురించి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త, ఇప్పుడు ఫ్యాన్స్ ని తీవ్రమైన నిరాశకి గురి చేస్తుంది. అదేమిటి అంటే ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ కి పవన్ కళ్యాణ్ పాల్గొనట్లేదట. పవన్ కళ్యాణ్ మొదటి నుండి తన సినిమాలకు ప్రొమోషన్స్ విషయం లో దూరంగా ఉంటాడు అనే విషయం అందరికీ తెలిసిందే, ఇందులో కొత్తేమి ఉంది అని మీరు అనుకోవచ్చు.

పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్

ప్రొమోషన్స్ లో పాల్గొనకపోయిన , ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి మాత్రం కచ్చితంగా హాజరు అవుతుంటాడు ఆయన. కానీ ఈసారి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తుంది. ఈ చిత్రం వచ్చే నెల 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ బయటకి రాలేదని ఫ్యాన్స్ చాలా కోపం మీద ఉన్నారు.

Bro Movie

మూవీ టీం ని ప్రతీ రోజు ట్యాగ్ చేస్తూ టీజర్ కి సంబంధించిన అప్డేట్ ఇవ్వమని గోల పెట్టేస్తున్నారు. అలాంటి సమయం లో ఇప్పుడు వినిపిస్తున్న ఈ వార్త చూసి మరింత ఆవేశానికి గురి అవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాకపోవచ్చు అని అనడానికి కారణం, ఆయన ‘వారాహి’ టూర్ అనే చెప్పాలి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయం లో పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా వారాహి టూర్ ద్వారా విస్తృతంగా పర్యటించబోతున్నారు.

- Advertisement -
Pawan Kalyan

బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయానికి ఆయన ఏ ఊరిలో ఉంటాడో ఆయనకే తెలియని పరిస్థితి. కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేకపోవచ్చు అని అంటున్నారు ఇండస్ట్రీ కి చెందిన కొంతమంది ప్రముఖులు. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఐటెం సాంగ్ షూటింగ్ నేడు ప్రారంభం అయ్యింది. ఊర్వశి రౌతుల ఈ పాటలో పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ కోసం ఆడిపాడబోతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here