Box office Collections : ఈ సంక్రాంతికి బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు. విడుదలైన ఐదు రోజుల్లోనే వంద కోట్ల వసూళ్లు దాటాయి. ఇంకా నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి. మొదట వీరసింహారెడ్డిగా వచ్చిన బాలయ్య బాక్సాఫీస్ వద్ద ఊచకోత మొదలుపెట్టాడు. ఆ తర్వాత చిరంజీవి.. రావడం లేటవ్వొచ్చు గానీ రావడం మాత్రం పక్కా అంటూ సెన్సేషన్ క్రియేట్ చేశారు.
ఇక ఈ రెండు సినిమాలు కలెక్షన్ల రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక వాల్తేరు వీరయ్య చెప్పినట్టు.. రికార్డులో నా పేరు ఉండటం కాదు.. నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయన్నట్టు.. చిరంజీవి ఈ ఏడాది సంక్రాంతి బరిలో బాలయ్యపై పై చేయి సాధించాడు. ఇప్పటి వరకు బాలయ్య వీరసింహారెడ్డి 106 కోట్లు కలెక్షన్స్ సాధించగా.. మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమా 139 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తోంది.
బాక్సాఫీస్ దగ్గర ఈ రెండు సినిమాలు సెలవుల్లో సూపర్ కలెక్షన్స్‌ను సొంతం చేసుకుని బిజినెస్‌లో చాలా మొత్తాన్ని రికవరీ చేయగా రెండు సినిమాలు ఇప్పుడు వర్కింగ్ డేలోకి ఎంటర్ అయ్యాయి. వీరసింహా రెడ్డి సినిమా 5 రోజుల్లో మొత్తంగా 100 కోట్ల మార్క్‌ను అందుకుంటే వాల్తేరు వీరయ్య సినిమా 127 కోట్ల మార్క్‌ని దాటేసింది. ఇక వీర సింహా రెడ్డి సినిమా 6వ రోజు వర్కింగ్ డే ఇంపాక్ట్ తో స్లో అయినా ఓవరాల్ గా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల రేంజ్ లో గ్రాస్‌ను అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం.
వాల్తేరు వీరయ్య సినిమా బాక్సాఫీస్ దగ్గర అటూ ఇటూగా 11 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉందని సినిమా ట్రేడ్ వర్గాల టాక్. ఇక ప్రపంచ వ్యాప్తంగా వీరసింహారెడ్డి రూ.6 కోట్ల లోపు గ్రాస్ కలెక్షన్స్ అందుకునే దిశలో ఉండగా.. వాల్తేరు వీరయ్య రూ.12.50 కోట్ల రేంజ్ వద్ద ఉండనుందని సమాచారం.
దాంతో మొత్తం ఇప్పుడు వీరసింహారెడ్డి సినిమా రిలీజ్ అయిన ఆరు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.106 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధిస్తే.. వాల్తేరు వీరయ్య మూవీ రూ.139 కోట్ల మార్క్‌ను అందుకునే అవకాశముందని టాక్.