Varun Dhawan : ప్రభాస్​తో కృతి సనన్ రిలేషన్​షిప్ నిజమే.. కన్ఫామ్​ చేసిన బాలీవుడ్ హీరో..!

- Advertisement -

టాలీవుడ్ డార్లింగ్..పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్ బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్​తో ప్రేమలో ఉన్నాడని పుకార్లు తెగ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి తాజాగా ఆదిపురుష్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా వీరి రిలేషన్​షిప్ గురించి బాలీవుడ్ మీడియా తెగ వైరల్ స్టోరీస్ ప్రచురిస్తోంది.

ప్రభాస్ ఎఫైర్​లపైన రూమర్స్ కొత్తేమీ కాదు. పలువురు హీరోయిన్స్​తో ఆయన ఎఫైర్ నడిపారని చాలా పుకార్లు ఉన్నాయి. ముఖ్యంగా దేవసేన.. అదేనండి మన స్వీటీ అనుష్కతో ప్రభాస్ చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నాడంటూ వార్తలొచ్చాయి. నిన్న కృతి సనన్​తో ఎఫైర్ గురించి న్యూస్ వచ్చే ముందు వరకు కూడా సినీ ఇండస్ట్రీ ప్రభాస్-అనుష్క ప్రేమలో ఉన్నారనే అనుకున్నారు. కానీ తాజాగా కృతి పేరు తెరపైకి రావడంతో అందరితో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా షాకయ్యారు.

- Advertisement -

ప్రభాస్- అనుష్క జంట ఆన్​ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్​ కూడా బాగుంటుందంటూ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. వీళ్లిద్దరు కలిస్తే బాగుంటుందని ఫీల్ అవుతున్నారు. కానీ కృతితో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడంటూ వార్తలు రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురైనట్లు కనిపిస్తోంది. ఆదిపురుష్ షూటింగ్​లో ప్రభాస్-కృతిలు ప్రేమలో పడ్డట్లు పుకార్లు వచ్చాయి. దీనికి కృతి సనన్ తాజా కామెంట్స్ ఆజ్యం పోశాయి. ప్రభాస్​తో పెళ్లికి రెడీ అని కృతి ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో దాదాపు వీళ్ల రిలేషన్​షిప్ ఖాయమేనని అందరూ అనుకున్నారు.

కృతి సనన్ ఏదో సెన్సేషన్ కోసమో లేదా ప్రభాస్​పై అభిమానంతో ఈ మాట చెప్పలేదని తాజా పరిణామాలు చూస్తుంటే అనిపిస్తుంది. ప్రభాస్-కృతి మధ్య సీరియస్ రిలేషన్ నడుస్తుందా అనే సందేహం కలుగుతోంది. రీసెంట్​గా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ చేసిన కామెంట్స్ చూస్తుంటే వీళ్ల రిలేషన్​షిప్ పుకార్లు నిజమేనేమో అనిపిస్తున్నాయి. ఇంతకీ వరుణ్ ఏం చెప్పాడంటే..?వరుణ్ ధావన్-కృతి జంటగా భేడియా మూవీలో నటించారు. రీసెంట్​గా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రమోషన్స్​లో వరుణ్-కృతి బిజీబిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కృతి సనన్, వరుణ్ ధావన్ ఒక బాలీవుడ్ షోలో పాల్గొన్నారు. ఆ షోలో యాంకర్​గా కరణ్ జోహార్ ఉన్నాడు. కృతిసనన్ పేరు నీ గుండెల్లో ఎందుకు లేదని కరణ్, వరుణ్​ని అడిగాడు. ఎందుకంటే… కృతి నేమ్ మరొకరి గుండెల్లో ఉంది. ఆయన ముంబయిలో లేడు. మరోచోట దీపికా పదుకొనె తో షూటింగ్​లో పాల్గొంటున్నాడని వరుణ్ కామెంట్ చేశాడు.

varun dhawan
varun dhawan

వరుణ్ కామెంట్స్​కు కృతి నవ్వుతున్నట్లు కనిపించినా ఇబ్బందికరంగా హ్యాండ్ మూమెంట్స్ ఇచ్చారు. వరుణ్ ధావన్ హింట్ ప్రకారం ప్రభాస్ గుండెల్లో కృతి పేరుంది. ఆయన హైదరబాద్​లో దీపికా పదుకొనెతో పాటు ప్రాజెక్ట్ కె షూట్​లో పాల్గొంటున్నాడని స్ఫష్టంగా అర్థం అవుతుంది. వరుణ్ ధావన్ అంత కాన్ఫిడెంట్​గా చెప్పిన నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందనే సందేహాలు మొదలయ్యాయి.

ప్రభాస్ పెళ్లి విషయంలో ఏదైనా సంచలన ప్రకటన రానుందా అని ఊహాగానాలు మొదలయ్యాయి. ఇక ప్రభాస్​కు పెళ్లి ఈడు ఎప్పుడో దాటిపోయింది. ఆయన ప్రస్తుత వయసు 42 సంవత్సరాలు. అనుష్కతో పెళ్లి వార్తలను ఇటు స్వీటీతో పాటు ప్రభాస్ కూడా ఖండించాడు. మరి కృతి సనన్ వ్యవహారం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here