Bhagavanth Kesari లో 5 నిమిషాల పాత్ర కోసం బిగ్ బాస్ ‘రతికా’ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

- Advertisement -

Bhagavanth Kesari : బిగ్ బాస్ సీజన్ 7 లో ఉన్నది కేవలం నాలుగు వారాలే అయినా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులను ఆకర్షించిన కంటెస్టెంట్ రతికా రోజ్. ఈమె నాల్గవ వారం లో ఎలిమినేట్ అయిన సంగతి మన అందరికీ తెలిసిందే. హౌస్ లోకి అడుగుపెట్టిన కొత్తల్లో ఈమె తెలివితేటలు, ఆడే తీరు చూసి నాగార్జున సైతం ఆశ్చర్యపోయారు. కానీ అదే రేంజ్ జోరుని తదుపరి వారాల్లో కొనసాగించలేకపోయింది రతికా.

Bhagavanth Kesari
Bhagavanth Kesari

గేమ్స్ ఆడడం మీద కంటే కూడా ఆమె ఎక్కువగా ఫేక్ బాండింగ్స్ ఏర్పాటు చేసుకోవడం వల్లే ఆడియన్స్ ఆమెని ఇంటికి పంపేశారు. అయితే ఇప్పుడు ఈమె వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ వీకెండ్ లో ఆమె అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. ఇదంతా పక్కన పెడితే నిన్న విడుదలైన బాలయ్య బాబు ‘భగవంత్ కేసరి’ చిత్రం లో రతికా ఒక చిన్న పాత్రలో కనిపించిన సంగతి మన అందరికీ తెలిసిందే.

Rathika rose

ఈ చిత్రం లో ఆమె ఒక మినిస్టర్ పాత్రలో కనిపిస్తుంది. స్క్రీన్ మీద ఈమె ఎంట్రీ ఇవ్వగానే ఆడియన్స్ చేసిన హంగామా మామూలుది కాదు. కనిపించింది తక్కువ సేపే అయినా ఆమె పాత్రకి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈమె కనిపించిన ఈ 5 నిమిషాల పాత్ర కోసం నిర్మాతలు ఆమెకి 5 లక్షల రూపాయిలు ఇచ్చారట. అంత తక్కువ నిడివి ఉన్న పాత్ర కి ఆ రేంజ్ పారితోషికం తక్కువేమి కాదు.

- Advertisement -
Bigg Boss Telugu Rathika rose

సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తున్న సమయం లోనే ఆమె ఈ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకుంటే, ఇక పూర్తి స్థాయి క్యారెక్టర్స్ చేస్తే ఏ రేంజ్ లో రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తుందో అని అనుకుంటున్నారు ఆడియన్స్. రతికా అందం విషయం లో హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోదు. ఈ బిగ్ బాస్ హౌస్ ఆమెకి మంచి మేలు చేసిందనే చెప్పాలి, మరి ఆమె రీ ఎంట్రీ తర్వాత బిగ్ బాస్ సీజన్ 7 టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలుస్తుందో లేదో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here