Rathika Rose : ‘భగవంత్​ కేసరి’లో బిగ్​ బాస్​ బ్యూటీ రతికా రోజ్​.. ఏ పాత్రలో నటించిందో తెలుసా..?

- Advertisement -

Rathika Rose : నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. ఇవాళ థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా యాక్షన్ అండ్​ ఎమోషనల్ కంటెంట్‌ తొలి షో నుంచే పాజిటివ్ టాక్ అందుకుంది. ‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’ వంటి బ్లాస్ బాస్టర్​ హిట్లను ఖాతాలో వేసుకుని ఫుల్ ఫామ్‌తో ఉన్న బాలయ్య బాబు .. ఇప్పుడు తాజాగా ‘భగవంత్​ కేసరి’తో హ్యాట్రిక్ హిట్​ను అందుకున్నాడు. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో బాలయ్య సరసన నటించింది. ఇక టాలీవుడ్ మోస్ట్ హాప్పెనింగ్ హీరోయిన్ శ్రీలీల బాలయ్యకు కూతురిగా ఈ సినిమాలో అదరగొట్టింది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్​ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు.

rathika rose
rathika rose

అయితే ఈ సినిమాలో బిగ్​బాస్ బ్యూటీ ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించిందట. ఇంతకీ ఆమె ఎవరంటే.. ఇంకెవరు..? బిగ్​బాస్ హౌసులోకి ఎంట్రీ ఇచ్చిన నాలుగు వారాల్లో హౌస్​లో ఉన్న మేల్ కంటెస్టెంట్ల గుండెతో పాటు యావత్ తెలుగు యువకుల గుండె కొల్లగొట్టి.. నాలుగు వారాల్లోనే ఎలిమినేట్ అయి మళ్లీ రెండు వారాలు తిరక్క ముందే హౌస్​లోకి గ్రాండ్​గా రీ ఎంట్రీ ఇచ్చిన రతికా రోజ్. అయితే ఈ బ్యూటీ ఆ చిత్రంలో ఉన్నట్లు ప్రచార కార్యక్రమాల్లో కానీ.. ట్రైలర్​లో కానీ కనిపించలేదు. కానీ సినిమా విడుదలైన తర్వాత ఈ భామ భగవంత్ కేసరిలో కనిపించినట్లు ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ విషయం తెలిసి రతిక ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ భామ ఆ సినిమాలో ఏ పాత్రలో నటించిందని తెలుసుకునేందుకు వెంటనే టికెట్​ బుక్ చేసుకుని మరి సినిమాకు వెళ్తున్నారు. మరి ఇంతకీ ఈ భామ ఆ సినిమాలో ఏ పాత్రలో కనిపించిందంటే..?

భగవంత్ కేసరిలో రతికా రోజ్ ఓ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేగా కనిపించిందట. ఎక్కువ సేపు స్క్రీన్​ టైమ్​ లేకపోయినా.. పాత్ర పవర్ ఫుల్​గా ఉందట. కనిపించిన కాసేపైనా సరే ఈ బ్యూటీ.. ప్రేక్షకులను ఆకట్టుకుందనే టాక్ నడుస్తోంది. బాలయ్య సినిమాలో రతికను ఇలా చూసిన వాళ్లంతా ఈ బ్యూటీ బంపర్ ఆఫర్ కొట్టేసింది అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇక బిగ్​బాస్​ హౌస్​లో పల్లవి ప్రశాంత్, యావర్‌తో ప్రేమాయణం.. ఆ తర్వాత మరీ ముఖ్యంగా ప్రశాంత్​తో విడిపోయి దారుణంగా గొడవ పడటం అంతా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిన విషయం తెలిసిందే. ఇక అంతకుముందు బయట సింగర్ రాహుల్ సిప్లిగంజ్​తో ప్రేమ.. బ్రేకప్ గురించి కూడా నెట్టింట తెగ చర్చ నడిచింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here