Duniya Vijay : బాలకృష్ణ అలాంటి వాడా.. బాలయ్య నిజస్వరూపం బయటపెట్టిన కన్నడ నటుడు

- Advertisement -

Duniya Vijay : నందమూరి బాలకృష్ణ హీరోగా అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న మూవీ వీరసింహారెడ్డి. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో శ్రుతిహాసన్ కథానాయిక. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్, ప్రోమోస్, టీజర్, పాటలు చూసి ఫ్యాన్స్ పూనకాలు లోడింగ్ అని అంటున్నారు. రేపు ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే చిత్రబృందం చెప్పింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Duniya Vijay
Duniya Vijay

ఈ సినిమా ప్రమోషన్స్ కూడా జోరందుకున్నాయి. ఈ మూవీలో కీలక పాత్ర పోషించిన కన్నడ నటుడు దునియా విజయ్‌ కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన విజయ్ తెలుగు సినిమాలో నటించడం.. బాలకృష్ణతో కలిసి పనిచేయడం గురించి చెప్పారు. అంతే కాకుండా బాలయ్య బాబు గురించి ఎవరికీ తెలియని ఓ విషయం చెప్పారు. ఆ విషయం విన్న అభిమానులు.. ఇతర ఆడియెన్స్ బాలయ్య బాబు ఇలాంటి వాడా అని ఆశ్చర్యపోతున్నారు. బాలయ్య యాటిట్యూడ్ గురించి తెలిసి ఆయన క్యారెక్టర్ కు మరోసారి ఫిదా అవుతున్నారు. 

Duniya Vijay and Balakrishna
Duniya Vijay and Balakrishna

దునియా విజయ్ వీరసింహారెడ్డి సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటించారు. ఆయన ఈ మూవీలో తన పాత్ర గురించి మీడియాతో మాట్లాడారు. ‘‘వీరసింహారెడ్డి’ కథలో నా పాత్ర గురించి గోపిచంద్‌ చెప్పగానే చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఇందులో ప్రతినాయకుడి పాత్ర ఒక పిల్లర్‌లా బలంగా ఉంటుంది. ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్ర. ఇంత మంచి పాత్రలో అదీ బాలకృష్ణతో కలిసి నటించడం అదృష్టం. ఇందులో నేను ముసలిమడుగు ప్రతాప్ రెడ్డిగా కనిపిస్తా’’ అని చెప్పుకొచ్చారు విజయ్.

- Advertisement -

‘‘ఈ చిత్రంలో పోరాటాలు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ప్రేక్షకులు ఆ ఎనర్జీని థియేటర్‌లో ఫీలవుతారు. ఇక బాలకృష్ణతో కలసి పని చేయడం జీవితంలో మర్చిపోలేను. పని పట్ల ఆయన ఎంతో అంకితభావంతో ఉంటారు. బాలకృష్ణను ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ చూస్తున్నపుడు దేవుడు లాంటి మనిషి అనిపించింది. వీరసింహా రెడ్డి..అభిమానులకు, ప్రేక్షకులకు గ్రేట్ ఎమోషనల్ జర్నీ’’ అని అన్నారు.

‘‘వీరసింహారెడ్డి’ తర్వాత తెలుగులో మంచి పాత్రలు వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఒక నటుడిగా అన్ని పాత్రలు చేయాలని ఉంది. నటన, దర్శకత్వం  రెండు వేరు వేరు. దర్శకుడిగా నటుల నుంచి యాక్టింగ్ రాబట్టుకోవాలి. నటుడిగా ఉన్నపుడు నా పని నటించడమే. ప్రస్తుతం ‘భీమా’ అనే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా.  తెలుగులో కూడా కొందరు సంప్రదించారు. ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు’’

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here