Bigg Boss Telugu : ఈవారం నామినేషన్ లో ఏకంగా ఏడుగురు.. నాగార్జున ట్విస్ట్ మాములుగా లేదుగా..



Bigg Boss Telugu : బిగ్ బాస్ సీజన్ 7లో మూడో వారం నామినేషన్స్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వారే శుభశ్రీ, గౌతమ్, ప్రియాంక, దామిని, యావర్, రతిక, అమర్‌దీప్. శుభశ్రీ విషయానికొస్తే.. తను చాలావరకు ఇంటి పనుల్లో యాక్టివ్‌గా ఉండడం లేదని పలువురు కంటెస్టెంట్స్.. తనను నామినేట్ చేయడానికి ముందుకొచ్చారు. ఈ కారణానికి శుభశ్రీ అసలు ఒప్పుకోలేదు. తాను కూడా పనిచేస్తున్నానని వాదించడం మొదలుపెట్టింది.

Bigg Boss Telugu
Bigg Boss Telugu

ముందుగా అమర్‌దీప్ వచ్చి ఈ కారణంతో నామినేట్ చేయడంతో తనతో వాగ్వాదానికి కూడా దిగింది. ఆ తర్వాత దామిని కూడా తనను కావాలని టార్గెట్ చేస్తుందంటూ వ్యాఖ్యలు చేసింది. గత వారం జరిగిన టాస్క్ అనేది ఈ వారం పలువురు కంటెస్టెంట్స్.. నామినేషన్స్‌లో నిలబడేలా చేసింది. ముఖ్యంగా గౌతమ్ కృష్ణ, రతికకు అయితే అదే కారణం వల్ల నామినేషన్స్ పడ్డాయి. టీమ్ మాట వినకుండా మొండిగా ఉందని రతికను నామినేట్ చేశారు కంటెస్టెంట్స్.

bigg boss 7

గౌతమ్ వల్లే టీమ్ మధ్య వివాదాలు వచ్చాయనే కారణంతో తనకు నామినేషన్స్ పడ్డాయి. ఇక రతిక, గౌతమ్‌లు కూడా ఒకరినొకరు ఇదే కారణంతో నామినేట్ చేసుకున్నారు. ప్రియాంక విషయానికొస్తే.. తను గేమ్ సరిగా ఆడలేదని కొందరు నామినేట్ చేశారు. ప్రిన్స్ యావర్ మాత్రం ప్రియాంక యాటిట్యూడ్ బాగా లేదంటూ తనను నామినేట్ చేశాడు. అమర్‌దీప్ ప్రవర్తన నచ్చలేదని తనను కూడా నామినేషన్స్‌లో పెట్టారు కంటెస్టెంట్స్.