తన కొడుకుకు మర్యాద ఇవ్వట్లేదంటూ అమర్ పై సంచలన కామెంట్స్ చేసిన పల్లవి ప్రశాంత్ తండ్రి..

Bigg Boss


బిగ్ బాస్ సీజన్ 7లో రెండో వారం జరిగిన నామినేషన్స్‌లో కంటెస్టెంట్స్ అంతా ఒకవైపు అయిపోతే.. పల్లవి ప్రశాంత్ ఒక్కడే ఒకవైపు అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. దానిపై తన తండ్రి స్పందించారు. ‘‘ప్రశాంత్‌ను ఘోరంగా తిడుతున్నారు. డబ్బులు ఉన్నాయనే అలా మాట్లాడుతున్నారు. రైతుబిడ్డ కాబట్టి రైతులకు డబ్బులు ఇస్తా అన్నాడు. రైతుల కష్టాలు తెలుసు కాబట్టి ఇస్తా అన్నాడు’’ అంటూ ప్రశాంత్ తండ్రి తెలిపారు.

బిగ్ బాస్
బిగ్ బాస్

ప్రశాంత్‌ను ఇంట్లో అందరూ రారా, పోరా అంటున్నారని వాపోయారు. ప్రేమగా అంటే ఏం కాదు కానీ అది అమర్యాదగా అనిపిస్తుందని బాధపడ్డారు. నామినేషన్స్ సమయంలో అమర్‌దీప్, పల్లవి ప్రశాంత్ మధ్య జరిగిన గొడవ హైలెట్‌గా నిలిచింది. ఇక అమర్‌దీప్‌ను, అతడు అన్న మాటలను ఉద్దేశించి కూడా ప్రశాంత్ తండ్రి వ్యాఖ్యలు చేశారు. ‘‘అతడు చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. డాక్టర్ కూడా అలాగే మాట్లాడాడు.

ఇద్దరు ఉన్నవాళ్లే. ఒక సీరియల్ తీస్తే అతడికి రూ.10 లక్షలు వచ్చినప్పుడు బీటెక్ చదివినవాళ్లకి ఇవ్వచ్చు కదా. మరి ఎవరికైనా ఇచ్చారా. లేదు కదా. ప్రశాంత్‌పై అతను పళ్లు కొరుకుతున్నాడు. అయినా కూడా అతను నా కొడుకులాగానే. ప్రశాంత్‌ను రారా, పోరా అన్నా కూడా అతను నా పెద్ద కొడుకు అనుకుంటాను’’ అని అమర్‌దీప్ గురించి మాట్లాడారు ప్రశాంత్ తండ్రి.